Site icon Prime9

Actor Ravibabu : 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన రాజకీయ ఎత్తుగడ – రవిబాబు

Actor Ravibabu response on chandrababu naidu arrest and video got viral

Actor Ravibabu response on chandrababu naidu arrest and video got viral

Actor Ravibabu : టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా రవిబాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. జీవితంలో ఏది శాశ్వతం కాదండి.. సినిమా వాళ్ల గ్లామర్‌ గానీ, రాజకీయ నాయకుల పవర్‌గానీ, అస్సలు శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబు నాయుడికి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు. రామారావుగారి ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ మా ఫ్యామిలీకి బాగా ఆప్తులు.. బాగా కావాల్సిన వాళ్లు. చంద్రబాబు నాయుడు ఏదైనా పనిచేశారంటే వంద యాంగిల్స్ లో చూసి, అందరిని సంప్రదించి ఎవరికి ఇబ్బంది కలుగకుండా నిర్ణయం తీసుకుంటారు.

ఆయనకు భూమ్మీద ఇవాళే లాస్ట్ రోజుని తెలిసినా, కూర్చొని నెక్ట్స్ యాభై ఏళ్లకి సోషల్‌ డెవలప్‌మెంట్‌ గురించి ప్లాన్స్ వేస్తారు. డబ్బు కోసం కక్కుర్తి పడే వ్యక్తి కాదు. అలాంటి ఆయన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు చాలా సహజం. కానీ డెబ్బై మూడేళ్ల వయసున్న ఆయన్ని జైల్లో పెట్టి హింసించడం ఏ ఎత్తో పై ఎత్తో అయితే మాత్రం చాలా దారుణం. అశాశ్వతమైన పవర్‌ ఉన్న వాళ్లకి నా హంబుల్‌ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏ పవర్‌ని అయితే వాడి ఆయన్ని జైల్లో పెట్టారు, అదే పవర్‌ని వాడి ఆయన్ని వదిలేయండి అంటూ రవిబాబు (Actor Ravibabu) వ్యాఖ్యానించారు.

మీరు చిటికెస్తే అది జరిగిపోతుందని అందరికి తెలుసు. మీరు ఆయన్ని బయటుంచి ఏ ఇన్వెస్టిగేషన్‌ అయినా చేయండి, ఆయన కచ్చితంగా ఈ దేశాన్ని వదిలి పారిపోరు. ఆలోచించండి. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు. కక్షతో రగిలిపోయే కసాయి వాళ్లలాగనా, జాలి మనసు, మోరల్స్ ఉన్న మంచి నాయకుడిలాగనా? దయజేసి చంద్రబాబు నాయుడిని వదిలేయండి, నాలాగా ఎంతో మంది మీపై కృతజ్ఞతతో ఉంటారు అని మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 

 

Exit mobile version