Site icon Prime9

Duvvada: ట్రైన్, ఫ్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కున్న విద్యార్ధిని

Train

Train

Duvvada: ట్రైన్ దిగుతున్న సమయంలో జారిపడి ఒక యువతి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఇరుక్కుపోవడంతో గంట పాటు నరకయాతన అనుభవించింది. విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని విజ్ఞాన్ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. ఆమె బుధవారం గుంటూరు నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో దువ్వాడ చేరుకుంది. ట్రైన్ దిగుతున్నసమయంలో హడావిడిలో ఆమె జారి రైలు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. ఆ యువతి భయంతో కేకలు వేయడంతో అందరూ అవాక్కయ్యారు.రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి రైలును ఆపి బాలికను రక్షించారు. ఆమెను చాకచక్యంగా బయటకు తీసి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. యువతిని కాపాడిన రైల్వే సిబ్బందిని స్థానికులు అభినందించారు.

 

Exit mobile version