Avinash Reddy: ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లిన వైఎస్ అవినాష్ కు నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్‌ను అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ ను విచారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ మెన్షనింగ్ లిస్టులో లేకపోవడం వల్లే విచారణ చేయలేమని వెకేషన్ బెంచ్ తెలిపింది.
అవినాష్ కు ఎదురుదెబ్బ..
ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లిన వైఎస్ అవినాష్ కు నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్‌ను అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ ను విచారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ మెన్షనింగ్ లిస్టులో లేకపోవడం వల్లే విచారణ చేయలేమని వెకేషన్ బెంచ్ తెలిపింది.
పిటిషన్ దాఖలు చేసే సమయంలో.. ఈ విచారణ మెన్షనింగ్ లిస్ట్ లో ఉందా అని ఎంపీ లాయర్లను న్యాయస్థానం అడిగింది. దీంతో లేదని సమాధానం ఇవ్వడంతో.. లిస్టులో ఉంటేనే విచారిస్తామని కోర్టు సమాధానం ఇచ్చింది. ఈ మేరకు మెన్షనింగ్ అధికారిని కలవాలని కోర్టు సూచించింది.
అరెస్ట్ పై ఉత్కంఠ..
ఇప్పటికే సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. దీంతో ఇపుడు ఏం జరుగుతుందోనని అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.