Actress Hema:బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. నటి హేమకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నటి హేమ, అషీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు తేల్చారు. నటి హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. హేమను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్లిన హేమ..(Actress Hema)
బెంగళూరు నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీ.. టాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్‌ను వారు విడుదల చేశారు. దీంతో సినీ నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తోంది.రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో పాల్గొన్న సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరి రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించింది. తాజాగా అందరి రక్త నమూనా రిపోర్ట్‌లు వచ్చాయని కర్ణాటక పోలీసులు తెలిపారు. తెలుగు నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులకు నటి హేమ వరుసగా ట్విస్ట్‌లు ఇచ్చింది. పార్టీకి వెళ్తున్న క్రమంలో తన పేరు బయటికి రాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది. తన అసలు పేరుకు బదులుగా కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హేమా, చిరంజీవి, ఆశి రాయికి బెంగుళూరు సీసీబి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
డ్రగ్స్ కేసులో హేమ పేరు వినిపించడంతో.. ఆమె సడెన్‌గా వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్‌లో ఉన్నానని బుకాయించింది. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో తనది కాదన్నారు. అంతే కాదు.. రేవ్ పార్టీతో సంబంధం లేదని బిర్యానీ వండి వార్చింది. చివరకు హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు రిపోర్ట్ రావడంతో.. హేమ డ్రామా బయటపడింది.