Harirama Jogaiah: ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని కాపు, బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. తన అంచనాల గురించి 6 నిమిషాల నిడివిగల వీడియో రిలీజ్ చేశారు.
తెలుగుదేశం 100 స్థానాల్లో.. జనసేన 16 అసెంబ్లీ సీట్లు, బి.జె.పి 5 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయంగా కనబడుతుందని పేర్కొన్నారు. టీడీపీ కూటమి ప్రజలకిచ్చిన హామీలు హోరెత్తిస్తుంటే వై.ఎస్.ఆర్ పార్టీ హామీలు చతికలపడ్డాయని బహిరంగ లేఖతోపాటు.. వీడియో రిలీజ్ చేశారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలోను, పవన్ కళ్యాణ్ రెండవ స్థానంలోను అధికార హోదాలలో అలరించబోతున్నారని జోగయ్య వివరించారు. హరిరామజోగయ్య చాలా రోజులనుంచి ఏపీలో టీడీపీ కూటమికి విజయావకాశాలు ఉన్నాయని చెబుతూ వస్తున్నారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్రపోషించాలని ఆయన కోరారు. ఎన్నికలముందు పవర్ షేరింగ్ పై స్పష్టమైన ప్రకటన వస్తే టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఓటు బ్యాంకు సులువుగా ట్రాన్స్ ఫర్ అవుతుందని కూడా ఆయన చెబుతూ వస్తున్నారు.