Vande Bharat Express: భారత రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనుంది. ఈ నెల 19న ఈ రైలు ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు నడవనుంది. మొదట సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే ప్రకటించిన ఈ ఎక్స్ ప్రెస్ ను తర్వాత వైజాగ్ వరకు పొడిగించారు. దీంతో సికింద్రాబాద్ – విశాఖ మధ్య అత్యంత వేగంగా నడిచే రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ నిలుస్తుంది. ఇంతముందు ఈ రూట్ లో నడిచే దురందో ఎక్స్ ప్రెస్ కంటే ఒక గంటన్నర ముందుగా వందేభారత్ లో విశాఖ చేరుకోవచ్చు. అంటే ఈ రూట్లో జర్నీ టైం మామూలుగా 12 గంటల టైం పడుతుండగా.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో ఆ సమయం 8 గంటలకు తగ్గుతుంది.
విశాఖలో మొదలై..
వందేభారత్ ఎక్స్ ప్రెస్(Vande Bharat Express) ప్రతిరోజూ నడుస్తుంది. ఉదయం వైజాగ్ నుంచి బయలుదేరే ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, వరంగల్ మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తర్వాత 20 నిమిషాల హాల్ట్ తీసుకుని మళ్లీ సికింద్రాబాద్ లో మొదలయి వరంగల్, విజయవాడ, రాజమండ్రి మీదుగా ప్రయాణించి విశాఖపట్టణం చేరుకుంటుంది. రైల్వేశాఖ నిర్ణయించిన టైమింగ్స్ ప్రకారం విజయవాడలో 5 నిమిషాలు, మిగిలిన స్టేషన్లలో 2 నిమిషాలు మాత్రమే ఈ రైలు ఆగుతుంది. అయితే ఖమ్మం స్టేషన్ లో ఈ రైలు ఆగనున్నట్టు తెలుస్తోంది. కానీ ఖమ్మం హాల్ట్ వివరాలు రైల్వేశాఖ ప్రకటించలేదు.
80శాతం భారత్ లోనే
ఈ ఎక్స్ ప్రెస్ ఛార్జీలను రైల్వేశాఖ ఇంకా ప్రకటించలేదు. అదేవిధంగా ఈ రైలు ప్రస్తుతానికి బెర్తులు లేవు. కూర్చునే ప్రయాణించాల్సి ఉంటుంది. అత్యంత వేగంగా రైలు ప్రయాణిస్తుండటంతో 10 గంటల లోపే ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. ఇందులో 16 ప్యాసింజర్ కార్లు ఉంటాయి. వీటిలో 1100 సీటింగ్ కెపాసిటీ ఉంది. ట్రైన్ ఫ్రేమ్ పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేశారు. 80 శాతానికి పైగా రైలు భాగాలను మన దేశంలోనే తయారు చేశారు. చెన్నైలోని పెరంబూర్లో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ ట్రైన్ ను తయారుచేసింది. జీపీఎస్ ట్రాకింగ్ తో పాటు బయో వాక్యూమ్ టాయిలెట్స్ వందేభారత్ స్పెషల్.
రూట్స్ ఇలా..
సికింద్రాబాద్- వైజాగ్
సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 14.45 (2.45)
వరంగల్ – 16.25/16.27 ( 4.25 /4.27)
విజయవాడ – 19.10/19.15 ( రాత్రి 7.10/7015)
రాజమండ్రి – 21.15/21.17 ( 9.15 /9.17)
వైజాగ్ – 23.25 ( 11.25)
వైజాగ్ టూ సికింద్రాబాద్
వైజాగ్ లో ఉదయం 5.45
రాజమండ్రి – 8.08/8.10
విజయవాడ – 9.50/9.55
వరంగల్ – మధ్యాహ్నం 12.05/12.07
సికింద్రాబాద్ – 14.25 (2.45)
ఈ ఎక్స్ ప్రెస్(Vande Bharat Express) ను 2019 లో రైల్వేశాఖ ప్రారంభించింది. న్యూఢిల్లీ- వారణాసి రూట్లో మొదటి రైలును నడవగా .. అదే ఏడాది న్యూడిల్లీ – శ్రీ మాతా వైష్టోదేవి కాట్రా రూట్లో రెండో ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత 2022 సెప్టెంబర్ నుంచి మళ్లీ వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. న్యూడిల్లీ -అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్- గాంధీ నగర్, మైసూర్-చెన్నై, నాగ్ పూర్-బిలాస్ పూర్, హౌరా-న్యూజల్ పాయ్ గురి రూట్స్ లో ఈ ఎక్స్ ప్రెస్ అందుబాలోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”
Kantara: బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”
Samantha: మీకు నాలాగ అవ్వకూడదంటూ.. వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సమంత
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/