Site icon Prime9

Upcoming Releases : ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏవంటే ?

upcoming releases of movies and web series details in july last week

upcoming releases of movies and web series details in july last week

Upcoming Releases : జూలై నెలలో చివరి వారానికి వచ్చేశాం. కాగా గత రెండు, మూడు వారాలుగా వరుసగా చిన్న సినిమాలు థియేటర్‌లను పలకరిస్తున్నాయి. అలానే మంచి విజయాన్ని కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు లాస్ట్ లో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా రాబోతుండడం మూవీ లవర్స్ కి పండగే అని చెప్పాలి. మరి ఈ తరుణంలోనే ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్‌ లో రిలీజ్ అయ్యే చిత్రాలు (Upcoming Releases)..

బ్రో.. 

మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో”. మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుండగా.. తెలుగు నేటివిటీ, పవన్.. తేజు ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన పవన్, సాయి పోస్టర్లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని చెబుతున్నారు. పైగా ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో పవన్‌ ఇందులో నటించారు. కాలం అవతారంలో ఆయన కనిపించనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కేతికశర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, బ్రహ్మానందం, సముద్రఖని, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌..

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు హీరోగా చేసిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ ప్రణవి మానుకొండ హీరోయిన్ గా చేస్తుండగా.. బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు. ఏ.ఆర్‌.శ్రీధర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని మైక్‌ మూవీస్‌ నిర్మిస్తోంది. ఈ నెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. జాతకంలో దోషం ఉన్న ఓ యువకుడు కుక్కను పెళ్లి చేసుకోవడంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కథాంశంతో సినిమా తెరకెక్కింది.

రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ..

బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్ వీర్‌ సింగ్‌, అలియా భట్‌ జంటగా నటిస్తున్న చిత్రం “రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ”. కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 28న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌..

డ్రీమ్‌ (కొరియన్‌ మూవీ) జులై 25

మామన్నన్‌ (తమిళ్‌/తెలుగు) జులై 27

పారడైజ్‌ (హాలీవుడ్) జులై 27

హిడెన్‌ స్ట్రైక్‌ (హాలీవుడ్) జులై 27

హ్యాపీనెస్‌ ఫర్‌ బిగినెర్స్‌ (హాలీవుడ్‌) జులై 27

హౌ టు బికమ్‌ ఎ కల్ట్‌ లీడర్‌ జులై 28

డిస్నీ..

ఆషిఖానా (హిందీ సిరీస్‌) జులై 24

జియో సినిమా..

లయనెస్‌ (హాలీవుడ్‌) జులై 23

కాల్‌కూట్‌ (హిందీ) జులై 27

బుక్‌ మై షో..

జస్టిస్‌ లీగ్‌ : వార్‌ వరల్డ్‌ (యానిమేషన్‌ మూవీ) జులై 23

ట్రాన్స్‌ఫార్మర్స్‌ : రైజ్‌ ఆఫ్‌ ది బీస్ట్స్‌ (హాలీవుడ్‌) జులై 26

ద ఫ్లాష్‌ (హాలీవుడ్‌) జులై 27

సోనీలివ్‌..

ట్విస్టెడ్‌ మెటల్‌ (వెబ్‌సిరీస్‌) జులై 28

మనోరమా మ్యాక్స్‌.. 

కొళ్ల (మలయాళం) జులై 27

Exit mobile version