Ram Charan Upasana: రామ్ చరణ్ పై ఆయన సతీమణి స్వీట్ రివెంజ్ తీర్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో రామ్ చరణ్- ఉపాసన అందమైన జంట. ప్రస్తుతం వీరికి సంబంధించి నెటిజెన్ పెట్టిన వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోపై రామ్ చరణ్ అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు. మా అన్నయ్యను వదిలేయండి అంటూ.. కామెంట్లు పెడుతున్నారు.
వీడియోలో ఏముందో తెలుసా? (Ram Charan Upasana)
వైరల్ అవుతున్న వీడియోలో ఉపాసన రామ్ చరణ్ పై రివెంజ్ తీర్చుకున్నారు. ఓ కార్యక్రమంలో తనను సోఫాలో నుంచి లేపడంతో.. ఉపాసన ఓసారి భంగపడ్డారు. అనంతరం ఇంటికి వెళ్లాక.. చరణ్‌తో ఇంటి పనులు చేయించారు. ఇది నిజం కాదండోయ్.. ఓ ఫ్యాన్ ఎడిట్ చేసిన వీడియో మాత్రమే. ఈ వీడియో సరదాగా ఉండటంతో.. ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల సందర్భంగా.. ఓ వీడియో వైరల్ అయింది. అందులో రామ్‌చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్ ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఉపాసన, రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్ ఒకే సోఫాలో కూర్చున్నారు. దీంతో సోఫా కాస్త ఇరుగ్గా ఉండటంతో రామ్‌చరణ్ ఉపాసనను పక్క సీటులో కూర్చోమని చెప్పారు. ఈ విషయంలో.. ఆమెను రామ్ చరణ్ ఆటపట్టించారని అందరు అన్నారు. ఈ వీడియోలో రామ్‌చరణ్.. సాయిధరమ్ తేజ్ నవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది.
అమ్మాయిల కౌంటర్ ఇలా ఉంటుంది.
అబ్బాయిల ఫన్ ఇలా ఉంటుందన్న ఓ నెటిజన్ వీడియో షేర్ చేశాడు. దీనికి అమ్మాయిల కౌంటర్ మరో లెవెల్‌లో ఉందంటూ.. మరో వీడియోను ఓ అభిమాని జత చేశారు. ఇందులో రామ్ చరణ్ తో ఉపాసన.. ఇంటి పనులన్నీ చేయించినట్టు చూపించారు. చెట్లకు నీళ్లు పోయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, స్వయంగా కాఫీ కలిపి ఉపాసనకు ఇవ్వడం ఇందులో చూపించారు. అమ్మాయిలతో వ్యవహారం ఇలా ఉంటుందని ఈ వీడియోలో చెప్పారు. ఈ కాన్సెప్ట్ బాగా క్లిక్ అవడంతో నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు ఉపాసన. తన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇది వరకే ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడంతో.. అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.