Unstoppable Promo: పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలే. బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనికి సంబంధించి గ్లింప్స్ ను కూడా ఆహా విడుదల చేసింది. ఇక ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదలైంది. ప్రోమో లో బాలయ్య వేసిన ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పారు.
ప్రోమో రిలీజ్ చేస్తున్నట్లు ఆహా ప్రకటించడంతో.. కోట్లాది మంది పవన్ అభిమానులు ఈ ప్రోమో కోసం ఎదురు చుశారు. 7 గంటలకు ఈ ప్రోమో విడుదల అయింది.
ఇది వరకే ఓ ప్రోమోను విడుదల చేయగా.. దానికి అనూహ్య స్పందన వచ్చింది. పూర్తిస్థాయి ప్రోమో కొరకు పవన్ అభిమానులు వెయి కళ్లతో ఎదురు చుశారు. ఈ ప్రోమోతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
ఇది వరకే వదిలిన టీజర్ తోనే సరిపెడుతారని పవన్ అభిమానులు అనుకున్నారు.
కానీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతూ ఆహా ట్వీట్ చేసింది. ఇలాంటి ప్రోమో ఉంటుందని అభిమానులు అస్సలు ఊహించి ఉండరు.
పవన్ (Pawan kalyan) అభిమానులు నిరాశపడకుండా.. నాలుగు నిమిషాలు ఉన్న ప్రోమో ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ ప్రోమో కోసం పవన్ అభిమానులే గాక.. ఇతర హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చుశారు.
ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది.
మెుదటి భాగం.. ఫిబ్రవరి 5 న.. మిగతా భాగం ఫిబ్రవరి 14 న విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా హాజరయ్యాడు.. ఇక మధ్యలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్, రామ్ చరణ్ తో సంభాషిస్తాడు.
ఇవన్నీ ఎపిసోడ్ కి హైలైట్స్ గా నిలవనున్నాయి.
Mem vinnam. Mem unnam.
Wait is over for the most awaited and Baap of all Episodes promo.
Releasing at 7PM today🔥#PawanKalyanOnAHA @PawanKalyan #UnstoppableWithNBKS2#pawankalyan #NBKOnAHA #NandamuriBalakrishna pic.twitter.com/jwchqzM9eh— ahavideoin (@ahavideoIN) January 27, 2023
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/