Site icon Prime9

Unstoppable 2: అంత మంది ఫ్యాన్స్ ఉండి కూడా ఓట్లు ఎందుకు పడలేదన్న బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఎపిక్ ఆన్సర్

pawan -balakrishna

pawan -balakrishna

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు.

సెకండ్ సీజన్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది ఈ షో.

ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి గెస్టుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఏ రేంజ్ లో చూశారంటే.. దెబ్బకి ఆహా యాప్ కూడా క్రాష్ అయ్యేంతలా.

ప్రభాస్ టాక్ షో ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా.

అయితే, ప్రజెంట్ అందరి చూపులు పవర్ ఫుల్ ఎపిసోడ్ పైనా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఈ టాక్ షో లో పాల్గొన్నాడు.

అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ టైం రానే వచ్చింది.

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించి ‘పవర్ టీజర్’ను రిలీజ్ చేసింది ఆహా.

టీజర్ లో ఏముందంటే

అందుకే నన్ను బాలా అని పిలవమంటానని బాలకృష్ణ చెప్పడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. దానికి పవన్ కళ్యాణ్ నేను ఓడిపోవడానికైనా సిద్దమే కాని అలా పిలవనంటారు.

ఈ పాలిటిక్సే వద్దంటూ బాలయ్య అంటూ.. ఇపుడు నీ విమర్శల్లో వాడీ వేడీ డబుల్ ఇంపాక్ట్ అయింది.. అని బాలయ్య అనగానే నేను చాలా పద్దతిగా మాట్లాడతానండి అంటూ పవన్ సమాధానమిచ్చారు.

మీ అన్నయ్య చిరంజీవి గారి నుంచి నేర్చుకున్నవేంటి? వద్దనుకున్నవేంటి? అని బాలయ్య ప్రశ్నించడం ఈ టీజర్ లో కనిపించింది.

మరో సందర్బంలో మా వదినకు ఫోన్ చేసి ఇదే నా లాస్ట్ మూవీ అని చెప్పానని పవన్ అంటారు.

రాష్ట్రంలో నీ ఫ్యాన్ కానివాడు ఎవరూ లేడు.. మరి ఈ ప్రేమ ఓట్ల రూపంలోకి ఎందుకు మారలేదు అంటూ బాలయ్య ప్రశ్నిస్తారు.. దానికి పవన్ సమాధానం మాత్రం ఫుల్ ఎపిసోడ్ లో చూడాలి.

టీజర్ చివరిలో మేము బ్యాడ్ బాయ్స్… 12345678910 అంటూ బాలయ్య చెప్పడంతో ముగుస్తుంది టీజర్.

అన్ స్టాపబుల్ రికార్డ్స్ బ్రేక్

టీజర్ లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి చేసిన సందడి ఆకట్టుకుంది. బాలయ్య అడిగిన  కొంటె ప్రశ్నలకు పవన్ ఇచ్చిన ఆన్సర్స్ అదిరిపోయాయి.

ఈ ఎపిసోడ్ లో పవన్ సినిమా జీవితంతో పాటు కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు బాలకృష్ణ వేసినట్లు కనిపిస్తోంది. వాటికి పవన్ కళ్యాణ్ సమాధానాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మాత్రం అన్ స్టాపబుల్ అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

ట్రెండింగ్ లో ‘పవన్ కళ్యాణ్ ఆన్ ఆహా’

అన్ స్టాపబుల్ 2(Unstoppable 2) లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించి టీజర్ రిలీజ్ కానుందని ఆహా ప్రకటించింది.

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘పవన్ కళ్యాణ్ ఆన్ ఆహా’అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేందుకు సిద్దమయ్యారు.

ఇక టీజర్ రిలీజ్ కావడంతోనే ట్రెండింగ్ తో దుమ్ము లేపుతున్నారు. 1.24 నిమిషాల టీజర్ రిలీజ్ చేసిన ఆహా ..ఈ ఎపిసోడ్‌ను ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో అనౌన్స్ చేయలేదు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version