Prime9

Andheri (East) bypoll: అంధేరిలో విజయం అంచున ఉద్ధవ్ శివసేన అభ్యర్ధిని రుతుజా లట్కే

Maharashtra: దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 నియోజకవర్గాల్లో చేపట్టిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మహారాష్ట్రలో అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన శివసేన పార్టీ అభ్యర్ధిని రుతుజా లట్కే తన సమీప ప్రత్యర్ధికంటే 3812ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఆరో రౌండ్ ఫలితాలతో తెలుస్తుంది.

తెలంగాణలోని మునుగోడులో రౌండ్ రౌండుకు టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరు పోరు సాగుతోంది. నువ్వా? నేనా? అన్నట్లు పోటీ ఉంది. బీహార్ రాష్ట్రంలోని మోకామా సెగ్మెంటులో ఆర్జేడీ అభ్యర్థిని నీలందేవి ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 9వ రౌండు ముగిసేనాటికి నీలందేవి 39,063 ఓట్లతో తన సమీప బీజేపీ అభ్యర్థిని సోనందేవిపై ముందంజలో ఉన్నారు. ఒడిశా రాష్ట్రంలోని ధాంనగర్ సెగ్మెంటులో బీజేపీకి చెందిన సూర్యబంశీ సురాజ్ 8,737 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హర్యానా రాష్ట్రంలోని ఆదంపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థిపై కంటే 6,399 ఓట్ల ముందంజలో ఉన్నారు. యూపీలోని గోలా గోక్రానాథ్ సెగ్మెంటులో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి సమాజ్ వాదీపార్టీ అభ్యర్థి కంటే 5,013 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ లో భాజాపా అభ్యర్ధి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి: Shyam Sharan Negi: భారత తొలి ఓటర్ నెగీ కన్నుమూత

Exit mobile version
Skip to toolbar