Kodi Kathi: సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగాయి. ఈ సంక్రాంతి అందిరి ఇంటా సంతోషాన్ని నింపితే మరికొందరి ఇళ్లల్లో తీరని విషాదం నింపింది. ఆట చూసేందుకు వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి కోడికి కత్తి (Kodi Kathi) కడుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు.
ఈ రెండు విషాదాలు ఇరు కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చాయి. ఈ రెండు ఘటనలు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లికి చెందిన పద్మారావు ఊళ్లో జరుగుతున్న కోడి పందాల దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో బరిలో కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకొచ్చాయి.
ఒక కోడికి కట్టిన కత్తి పద్మారావు కుడి కాలు మోకాలు వెనుక భాగంలో గుచ్చుకుంది. కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది.
దీంతో నరాలు తెగిపోయి రక్తమోడింది. రక్తం ఎక్కువగా పోవడంతో పద్మారావు అక్కడికక్కడే మృతి చెందాడు.
గమనించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఎక్కువ రక్తస్రావం కావడంతో పద్మారావు మృతి చెందాడన్న వైద్యులు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపిన పోలీసులు.
హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు.
మరోవైపు కోడిపందాల Kodi Pandalu నిర్వాహకులు ఆకర్షణీయమయిన బహుమతులు అందచేస్తున్నారు.
మరో వ్యక్తి ఇలాంటి తరహా ఘటనలోనే ప్రాణాలు కోల్పోయాడు.
కిర్లంపూడి మండలం వేలంకలో గండే సురేష్ అనే మరో వ్యక్తి మరణించాడు.
కోడి కాలికి కత్తి కడుతుండగా గుచ్చుకొని సురేష్ ప్రాణాలు కోల్పోయాడు.
అసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందాడు.
స్థానిక లిడర్ల భయంతో సైలెంట్ గా ఉంటున్న పోలీసులు.
సమాచారం అందిన చూసీచూడనట్లు వ్యవహారిస్తున్న పోలీసులు.
కోట్లు చేతులు మారుతున్న పట్టించుకోని వైనం.
స్థానిక నేతలకు అండగా నిలుస్తున్న పోలీసులు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/