Site icon Prime9

Revanth Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ

Hyderabad: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తాను చేసిన హోంగార్డ్ ప్రస్తావనపైనా రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పారు. అద్ధంకి చేసిన వ్యాఖ్యలను బాధ్యత వహిస్తూ తాను సారీ చెబుతున్నానని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికీ మంచిది కాదన్నారు.

అద్దంకి దయాకర్ పై చర్యలు ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంతో పాటు కాంగ్రెస్ బలోపేతానికి వెంకట్ రెడ్డి ఎంతగానో కృషి చేశారన్నారు రేవంత్ రెడ్డి. ఆయన పై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారి పై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.

Exit mobile version