Vizag steel plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం యూ టర్న్ తీసుకుంది. ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తుతం పక్కనపెట్టామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్రం యూ టర్న్ తీసుకుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకే వెళ్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
మాటమార్చిన కేంద్రం (Vizag steel plant)
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం యూ టర్న్ తీసుకుంది. ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తుతం పక్కనపెట్టామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్రం యూ టర్న్ తీసుకుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకే వెళ్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వ్యాఖ్యలు గందరగోళం సృష్టించాయి. అయితే ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోలేదని కేంద్ర ఉక్కుశాఖ ప్రకటించింది. ప్రైవేటీకరణ అంశాన్ని పక్కనపెట్టామని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉందని పేర్కొంది. RINL పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగలేదని కేంద్రం వివరించింది.
కారణం ఏంటంటే..
మీడియాతో మాట్లాడిన మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ప్లాంటు విక్రయం ఆలోచన లేదని బాహాటంగా చెప్పారు.
రానున్న రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని బలోపేతం చేస్తామని అన్నారు.
దీంతో ఈ అంశంపై కేంద్రం వెనక్కి తగ్గిందని అనుకున్నారు. అయితే కొద్ది గంటల్లోనే కేంద్ర మంత్రి మాట మార్చేశారని కార్మిక నాయకులు ఆరోపించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
విక్రయించే సంస్థల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు కూడా ఉందని తెలిసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినట్టు వచ్చిన వార్తలను కేంద్రం కొట్టిపారేసింది.
అలాంటిదేమి లేదని.. ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని తెలిపింది.
శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని పేర్కొంది.
RINL ఉపసంహరణ ప్రక్రియపై ఎలాంటి ప్రతిష్టంభన లేదు. RINL పనితీరు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రం వెల్లడించింది.
ఈ నెలాఖరున విశాఖలో బహిరంగ సభ
ఇదంతా ఒకెత్తు అయితే విశాఖ ఉక్కు ఎజెండాగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు విశాఖ పట్టణంలో ఈ నెలాఖరున బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని చూస్తున్న కేసీఆర్ ఇదే అవకాశంగా భావిస్తున్నారట.