Site icon Prime9

Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే.. మీరు ఓ లుక్కేయండి!

telugu movies

telugu movies

Telugu Movies: వేసవికాలం కావడంతో.. సరికొత్త చిత్రాలు వెండితెర వద్ద సందడి చేయనున్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్లో రిలీజ్ అవ్వనుండగా.. మరికొన్ని ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి లుక్కేద్దాం..

మరి ఈ వారం ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

‘విరూపాక్ష’

సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమాను కార్తీక్ దండు తెరకెక్కించాడు. మిస్టరీ థ్రిల్లర్ జోనర్ ల సాయి ధరమ్ తేజ్ వస్తున్నారు. ఇక ఈ సినిమాను.. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సంయుక్తా మేనన్‌ కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 21న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒకే ఒక్క పాత్రతో..

గార్గేయి యల్లాప్రగడ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హలో.. మీరా’. కాకర్ల శ్రీనివాస్ దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు. ఇందులో సింగిల్‌ క్యారెక్టర్‌తో సినిమా సాగనుంది. సస్పెన్స్‌ డ్రామా థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం కథ మీరా అనే పాత్ర చూట్టూ తిరుగుతుంది. తెరపై కనిపించే మీరాతో పాటు తెర వెనుక ఫోన్‌లో వినిపించే పాత్రలు ఉత్కంఠ రేపుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

హౌ టు గెట్‌ రిచ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 18
చింప్‌ ఎంపైర్‌ (డాక్యుమెంటరీ)ఏప్రిల్‌ 19
ది మార్క్‌డ్‌ హార్ట్‌ (సీజన్‌2) ఏప్రిల్ 19
చోటా భీమ్‌ (సీజన్‌-17) ఏప్రిల్‌ 20
టూత్‌పరి (హిందీ) ఏప్రిల్‌ 20

డిప్లొమ్యాట్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 20
సత్య2 (తెలుగు) ఏప్రిల్‌ 21
రెడీ (తెలుగు) ఏప్రిల్‌ 21
ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 21
ఎ టూరిస్ట్స్‌ గైడ్‌ టు లవ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 21
సోనీలివ్‌

గర్మీ (సిరీస్‌)

డిస్నీ+హాట్‌స్టార్‌

సుగా (డాక్యుమెంటరీ స్పెషల్‌) ఏప్రిల్‌ 21

Exit mobile version