Agri Gold Case: లక్షల మందితో కోట్ల రూపాయల డిపాజిట్లు చేయించిన అగ్రిగోల్డ్ సంస్థ ఒక్కసారిగా బోర్డు తిప్పేసిన సంగంతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విదితమే. అధిక వడ్డీలిస్తామని చెప్పి లక్షలాది మంది అమాయకులను దోచుకుంది. దీనికి సంబంధించి డిపాజిటర్లంతా ఒక సంఘంగా ఏర్పడి కోర్డులో కేసు వేశారు. ఈ మేరకు విచారణ జరుగుతుంది. కాగా తాజాగా తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం ఈ కేసు విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయింది. కాగా అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం వెళ్లింది. 32 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని.. రూ.6,640 కోట్ల కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టుకు పిటిషనర్ తెలిపారు. హైకోర్టు కొన్ని ఆస్తులు వేలం వేసి రూ.50 కోట్లే రాబట్టిందని సుప్రీంకోర్టుకు పిటిషనర్ వెల్లడించారు. తదుపరి కేసును ఏలూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసిందని వారు న్యాయస్థానానికి వివరించారు.
అయితే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. తెలంగాణ డిపాజిటర్లను కూడా ఆంధ్రప్రదేశ్ ఏలూరు కోర్టుకు వెళ్లాలని సూచించింది. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఇదీ చదవండి: CM Jagan: చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్.. కుప్పానికి నాన్ లోకల్.. సీఎం జగన్