Site icon Prime9

Jawan Movie : “పుష్ప” మూవీ 3 సార్లు చూశా అంటూ అల్లు అర్జున్ కి రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్..

sharukh khan reply to allu arjun about jawan movie success

sharukh khan reply to allu arjun about jawan movie success

Jawan Movie : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో.. నటించిన సినిమా “జవాన్”. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా చేశారు. సెప్టెంబర్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం (Jawan Movie) బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఆరు రోజుల్లోనే 600 కోట్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయగా..  దీపికా పదుకునే, స్టార్ హీరో సంజయ్ దత్ గెస్ట్ అప్పియరెన్స్ లతో అదరగొట్టారు. ఆడియన్స్ తో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా మూవీ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మన టాలీవుడ్ తరపు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘జవాన్’ని ప్రశంసిస్తూ ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్స్ చేశాడు. “జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ తో టీమ్ అందరికీ శుభాకాంక్షలు. సినిమాలో నటీనటులు, టెక్నీషియన్లు, సిబ్బంది, ప్రొడ్యూసర్లు అందరికీ నా అభినందనలు. షారుక్ ఖాన్ మాసియస్ట్ అవతార్ ఇది. తన స్వాగ్ తో ఇండియాని, ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్” అని బన్నీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఇక ఈ ట్వీట్ కి షారుక్ ఖాన్ తాజాగా స్పందించారు.” థాంక్యూ సో మచ్ మ్యాన్. స్వాగ్ విషయానికి వస్తే పైరే నన్ను పొగుడుతుంది. వావ్ చాలా సంతోషంగా ఉంది. జవాన్ సక్సెస్ రెట్టింపు అయింది. నేను పుష్ప మూవీ మూడు రోజుల్లో మూడుసార్లు చూశాను. నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. నీకు పెద్ద హగ్. టైం దొరికినప్పుడు నేరుగా వచ్చి కౌగిలించుకుంటా, కీప్ స్వాగింగ్ లవ్ యూ” అని రిప్లై ఇచ్చారు. దీంతో వీరిద్దరి ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

 

 

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “. 2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో కూడా బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ దాదాపు 350 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో ఈ పార్ట్ ని తగ్గేదే లే అనే రేంజ్ లో నిర్మిస్తున్నారు.పార్ట్-1 రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు పూర్తి అవ్వుతున్నాయి. ఇక ఇటీవల ఈ మూవీకి గాను జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ (Allu Arjun) బెస్ట్ యాక్టర్ అవార్డుని, దేవిశ్రీప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని అందుకున్నారు. దీంతో సీక్వెల్ పై మరింత క్రేజ్ పెరిగింది. వచ్చే ఏడాది ఆగష్టు 15 నుంచి మొదలు కాబోతుంది.

Exit mobile version