Site icon Prime9

Samantha Koffee With Karan: విడిపోయిన తరువాత జీవితం చాలా కష్టంగా వుంది.. ‘కాఫీ విత్ కరణ్’ షోలో సమంత

Samantha Koffee With Karan: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ‏తో కలిసి సమంత పాల్గొంది. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సామ్ తన కెరీర్ గురించి వ్యక్తిగత జీవితం,పెళ్లి, విడాకులపై స్పందించింది.

సమంత రూత్ ప్రభు ఎట్టకేలకు నాగ చైతన్య నుండి విడిపోయిన విషయాన్ని బయటపెట్టింది. నటి కాఫీ విత్ కరణ్ 7లో అతని నుండి విడాకుల గురించి మాట్లాడింది. తాను మరియు నాగ చైతన్య విడిపోయిన తర్వాత జీవితం చాలా కష్టంగా ఉందని సమంత అంగీకరించింది. అయితే ప్రస్తుతం బలంగా వున్నానని తెలిపింది. నాగ చైతన్యకు మీకు మధ్య ఏవైన మనస్పర్థలు ఉన్నాయా అని అడగ్గా, మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది అంటూ సమాధానం ఇచ్చింది

చైతన్య గురించి అడిగే క్రమంలో కరణ్‌ జోహార్‌ మీ భర్త అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో వెంటనే మధ్యలో సమంత కల్పించుకుని ‘మాజీ భర్త’ అనాలి అంటూ కరెక్ట్‌ చేసింది. వెంటనే కరణ్ సారీ చెబుతూ, మీ మాజీ భర్త, మీరు విడిపోయినప్పుడు మీరే కారణమంటూ ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని భావించారా అని అడగ్గా, అవును, కానీ ప్రస్తుతం నేను దాని గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేను. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండటానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ స్పందించాలన్నా ఆ సమయంలో నా దగ్గర సమాధానాలు లేవని సమంత పేర్కొంది.

Exit mobile version