Site icon Prime9

Prabhas : ప్రభాస్ మేడమ్ ఎవరు? సనన్ ఆ .. శెట్టినా ?? రామ్ చరణ్ ఏం అన్నాడంటే ?

ram charan opens about prabhas relationship in balakrishna unstoppable show

ram charan opens about prabhas relationship in balakrishna unstoppable show

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్‏స్టాపబుల్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లో ప్రభాస్ పాల్గొంటున్నాడు అని ప్రకటించినప్పటి నుంచి ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ముందుగానే ఈ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేశారు. రెండు పార్ట్ లుగా ఈ ఎపిసోడ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ఆహా సంస్థ ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాత్రి పార్ట్ 1 ను రిలీజ్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. దీంతో డార్లింగ్ ఎపిసోడ్ ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో వీరిద్దరి సంభాషణ ఎంతో సరదాగా సాగింది.

ముఖ్యంగా బాలయ్య తనస్టైల్లో డార్లింగ్ ను ఓ ఆటాడుకున్నారు. యావత్ దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ పెళ్లి గురించి అసలు విషయాలు బయటకు తీసేందుకు తెగ ట్రై చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ స్నేహితుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హెల్ప్ కూడా తీసుకున్నారు. ప్రభాస్ పెళ్లి, రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. బాలయ్య ఓ ఆటాడుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అని అడగ్గా.. సారీ బాలయ్య గారు మాకు ఓ బ్రో కోడ్ ఉంటుంది. దానిని బ్రేక్ చేయలేను అన్నాడు చరణ్.

దీంతో ఈ బ్రో కోడ్ నాకు తెలుసు గానీ ముందు విషయం చెప్పు అంటూ పంచ్ వేశారు బాలయ్య. ప్రభాస్ డేటింగ్ చేస్తున్న అమ్మాయి రాజులా, రెడ్డిలా, నాయుళ్ల, చౌదరిలా, సనన్ లేదా శెట్టినా అనేది నువ్వు చెప్పాల్సిందే అని బాలయ్య బలవంతం చేయగా… చెప్పేస్తున్నానంటూ… త్వరలోనే ప్రభాస్ ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ చరణ్ హింట్ ఇచ్చాడు.

ఇక దీంతో బాలయ్య ఆ మేడమ్ ఎవరో చెప్పమంటూ తన స్టైల్లో అడిగేశారు. ముఖ్యంగా ఆ మేడమ్ సనన్ ఆ ?.. శెట్టి ఆ ? అంటూ బాలయ్య మాట కలిపారు. ఇక వెంటనే ప్రభాస్ రియాక్ట్ అవుతూ ” ఒరేయ్ చరణ్ నువ్వు అసలు నా ఫ్రెండ్ వా ? శత్రువా ? మన బ్రో కోడ్ బ్రేక్ చేసి నన్ను ఆడుకుంటావా.. నీ పని చెబుతాను ఆగు.. విషయం పూర్తిగా చెప్పు.. లేదంటే సోషల్ మీడియాలో ఇది మూడు వాచిపోద్ది ” అంటూ సరదాగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఎప్పుడూ బయట కలిసి కనిపించని… ప్రభాస్, చరణ్ మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక వీరిద్దరి సంభాషణ ఎంతో సరదాగా సాగడంతో ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చరణ్ ఈ షోకు వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి… లేదంటే నన్ను పిలవండి… అప్పుడు చెబుతా నేను కూడా అంటూ ప్రభాస్ చెప్పగా… ఎప్పుడు వస్తున్నావు చరణ్ అని బాలయ్య అడగ్గా.. మాట దూరం సార్.. మీరు పిలవండి వచ్చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుంది. ఇంతకీ ఆ మేడమ్ ఎవరా అని అంతా ఆలోచిస్తున్నారు.

Exit mobile version