Hyderabad: నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఈ ముఠా దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీ మహేష్ భగవత్ కేసు వివరాలను వెల్లడించారు.
అందులో భాగంగా జంగ దయాకర్ రెడ్డిని పట్టుకున్నామని చెప్పారు. నాచారానికి చెందిన జంగ దయాకర్ 11 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడని, అతనికి అమెరికా వెళ్లాలని కోరిక ఉండేదని తెలిపారు. మరో వ్యక్తి ముద్దం స్వామి యూఎస్ఏ లో ఉన్నాడని తెలిపారు. అయితే దయాకర్ రెడ్డి ఫేక్ సర్టిఫికెట్ పొంది అమెరికా పోవాలని ప్లాన్ చేశాడని, అందుకే స్వామిని అప్రోచ్ అయ్యాడని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.