Site icon Prime9

Bandla Ganesh : మరోసారి బయటపడ్డ త్రివిక్రమ్ – బండ్ల గణేష్ ఇష్యూ.. ఇన్ డైరెక్ట్ గా “గురూజీ” పై సెటైర్లు

producer bandla ganesh tweets on trivikram goes viral

producer bandla ganesh tweets on trivikram goes viral

Bandla Ganesh : ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి పలువురు హీరోలతో సినిమాలు నిర్మించి ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.  అయితే బండ్లకు మెగా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి వీర భక్తుడిగా బండ్ల గణేష్ కి పేరుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లలో బండ్ల పాల్గొంటూ ఇచ్చే స్పీచ్ లకి నెక్స్ట్ లెవెల్ లో అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. అలానే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు గణేష్. ముఖ్యంగా ట్విట్టర్‌లో రోజూ ఏవో ట్వీట్లు చేస్తూనే ఉంటారు. అభిమానులకు టచ్ లో ఉంటూ స్ఫూర్తినిచ్చే సూక్తులను ట్వీట్ చేస్తుంటారు.

అయితే గత కొన్నాళ్లుగా బండ్ల గణేష్ – త్రివిక్రమ్ మధ్య ఇష్యూ జరుగుతోంది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ వివాదం మరోసారి బయట పడింది. త్రివిక్రమ్ ని సినీ పరిశ్రమలో గురూజీ అని అంటారని అందరికి తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్ ప్రొడ్యూసర్ కావాలంటే ఏం చేయాలి అని బండ్ల గణేష్ కి ట్వీట్ చేశాడు. దీనికి బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ.. గురూజీని కలిసి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వు అయిపోతావు అని ట్వీట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

మరో నెటిజన్.. గురూజీకి కథ చెప్తే స్క్రీన్ ప్లే రాసి దానికి తగ్గట్టు కథ మార్చి, ఆ కథని షెడ్ కి పంపిస్తారని టాక్ ఉంది అని బండ్ల గణేష్ కి ట్వీట్ చేయగా, దీనికి బండ్ల గణేష్ సమాధానమిస్తూ.. అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ అని ట్వీట్ చేశాడు. దీంతో బండ్లన్న ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ అయితే కచ్చితంగా త్రివిక్రమ్ కే అని అందరికి అర్థమైపోతుంది. ఇండైరెక్ట్ గా తనని, పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ విడతీశాడని బండ్ల గణేష్ చెప్తున్నట్టు ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంలో కొందరు బండ్ల గణేష్ కి సపోర్ట్ చేస్తుంటే.. మరి కొందరు త్రివిక్రమ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి అయితే ఈ వ్యవహారం మరింత ముదిరేలా ఉందని భావిస్తున్నారు.

 

 

 

ఈ మేరకు గత ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన బండ్ల గణేష్ ఫోన్ కాల్ ఆడియో క్లిప్ ఒకటి ఆయనకు త్రివిక్రమ్‌తో ఉన్న విభేదాలను బయటపెట్టింది. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తనను త్రివిక్రమ్ పిలవద్దని చెప్పాడంటూ ఆడియో క్లిప్‌లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. త్రివిక్రమ్‌ను వాడూవీడూ అంటూ కూడా బండ్ల గణేష్ మాట్లాడారు. పవన్‌కు, తనకు మధ్య త్రివిక్రమ్ గ్యాప్ క్రియేట్ చేశారనే కోపం బండ్ల గణేష్‌కు ఉందని అప్పుడప్పుడు చేసే ట్వీట్స్, స్పీచ్ లలో గమనించవచ్చు.

Exit mobile version