Site icon Prime9

Producer Aswini Dutt : చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించిన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్..

Producer Aswini Dutt comments on nara chandrababu naidu arrest

Producer Aswini Dutt comments on nara chandrababu naidu arrest

Producer Aswini Dutt : తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ‘‘చంద్రబాబు ఒక మహానీయుడు. ఈ దేశానికి ఓ గొప్ప ప్రధానిని, గొప్ప లోక్‌సభ స్పీకర్‌ను, ఒక గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన గ్రేట్ లెజెండరీ చంద్రబాబు నాయుడిని దుర్మార్గకరంగా అరెస్ట్ చేసి.. బీభత్సం సృష్టించిన వారికి కచ్చితంగా పుట్టగతులు ఉండవు. దీనికి పరిష్కారం ఎన్నో రోజుల్లో లేదు. మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రాగానే వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు’’ అని అశ్వనీదత్ అన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు కచ్చితంగా 160 సీట్లను కచ్చితంగా చంద్రబాబు గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత నట్టి కుమార్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు కావడం ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మరోవైపు ములాఖత్ లో చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు జనసేన పవన్ కళ్యాణ్ వెళ్తున్నారని సమాచారం అందుతుంది. అయితే పవన్ తో పాటు నారా లోకేష్ కూడా ములాఖత్ లో ఉంటారో ఉండరో అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబు అరెస్టును ఖండించిన అశ్వినీ దత్ | Aswini Dutt React On Chandrababu Naidu Arrest |Prime9 Ent

 

 

Exit mobile version
Skip to toolbar