New Delhi: ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా సోకింది. ప్రియాంక గాంధీకి కరోనా సోకడం ఇది రెండోసారి. ఆమె ఐసోలేషన్లో వున్నారు. తనకు కరోనా వైరస్ సోకిందని ప్రియాంక గాంధీ ట్వీట్ ద్వారా సమాచారం అందించారు. ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ, “ఈ రోజు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డాను. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ప్రోటోకాల్‌ను అనుసరిస్తున్నాను అని తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ అనారోగ్య కారణాలతో రాజస్థాన్‌లోని అల్వార్ పర్యటనను రద్దు చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఈరోజు అల్వార్‌లో కాంగ్రెస్ నాయకత్వ సంకల్ప్ శివిర్‌లో పాల్గొనాల్సి ఉంది.
పార్టీలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించేందుకు, పార్టీ కార్యకర్తలు పుంజుకోవడానికి వీలుగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ క్యాంపులు నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మేలో నిర్వహించిన కాంగ్రెస్ చింతన్ శివిర్ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో పాటు కాంగ్రెస్ సంస్థలో వెనుకబడిన, దళిత, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారు.
జూన్‌లో కూడా ప్రియాంక గాంధీకి కరోనా వైరస్ సోకింది. అప్పుడు కూడా ప్రియాంక గాంధీ కూడా తనకు కరోనా సోకిందని ట్వీట్ ద్వారా తెలియజేసింది. తనలో చిన్నపాటి కరోనా లక్షణాలు కనిపించాయని ప్రియాంక గాంధీ చెప్పారు. అప్పుడు కూడా ప్రియాంక గాంధీ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు.