Site icon Prime9

Pawan Kalyan : పవన్ కి సెల్యూట్ కొట్టిన పోలీస్ డాగ్.. ఇన్ స్టా లో ఆసక్తికర పోస్ట్ !

pawan-kalyan share police dog video on instagram

pawan-kalyan share police dog video on instagram

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అటు సినిమాల వల్ల గాని ఇటు రాజకీయాల వాలా గాని జనాలలో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప‌వ‌న్ ఇటు సినిమాలకు అటు రాజ‌కీయాల్లోకు సమన్యాయం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫుల్ బగ్ గా ఉన్నారు . ట్విట్ట‌ర్‌లో రాజకీయాలకు సంబంధించి యాక్టివ్‌గా ఉండే పవన్ ఇటీవ‌ల కొన్నాళ్ళ క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. పవన్ కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు.

ట్విట్టర్ లో రెగ్యులర్ గా రాజకీయాల గురించి పోస్టులు పెట్టే పవన్ ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం చాలా రేర్ గా ఆసక్తికర పోస్టులు మాత్రమే పెడుతున్నారు.అయితే పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ విషయాలు చెప్పడం కోసం మాత్రమే ఈ ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టారు అనుకున్నారు అభిమానులు . అయితే రెండు వారాల క్రితం మోడీ సభ గురించి పోస్ట్ పెట్టిన పవన్ తాజాగా ఓ కుక్క గురించి పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి పోస్ట్ చేసిన అది అభిమానులు ఇట్టే వైరల్ చేస్తారు . ఇప్పుడు కూడా బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఓ పోలీస్ కుక్కతో పవన్ సరదాగా ఉన్న వీడియోని షేర్ చేస్తూ.. నేను బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నా ఫ్లైట్ ఎక్కేందుకు ఎదురుచూస్తుండగా నా కోసం ఓ సర్‌ప్రైజ్ విజిటర్ వచ్చాడు.

అతను ఎవరో కాదు పోలీస్ డాగ్ స్క్వాడ్ లో ఉండే బిందు(కుక్క). అది నాతో చాలా స్నేహంగా ఉంది. తన తోకని ఆసక్తిగా ఊపింది. తను నాలో ఉత్సాహం నింపింది. నేను విమానం ఎక్కేముందు ఓ అనుకోని అందమైన అనుభూతిని ఇచ్చింది అంటూ ఆసక్తికరంగా పోస్ట్ చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కుక్కతో సరదాగా ఆడుతున్న వీడియో వైరల్ అవగా అభిమానులు, నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరో వైపు రాజకీయాలలో కూడా రాణిస్తున్న పవన్ కళ్యాణ్ ఏపి , తెలంగాణలో తనదైన శైలి లో దూసుకుపోతున్నాడు .

Exit mobile version