Site icon Prime9

Pawan kalyan : ట్విట్టర్ లో సీఎం జగన్‌కి ‘క్లాస్’ పీకిన పవన్ కళ్యాణ్.. రాడ్ లు గట్టిగా దిగాయంటున్న జనసైనికులు

pawan kalyan counters to cm jagan and ycp leaders on twitter

pawan kalyan counters to cm jagan and ycp leaders on twitter

Pawan kalyan : జనసేన అధినేత గేర్ మార్చి సినిమాలు, రాజకీయాలలో స్పీడ్ పెంచారని తెలుస్తుంది.

ఒకవైపు వరుస సినిమాలు స్టార్ట్ చేస్తూ దూకుడు పెంచిన పవన్ మరో వైపు రాజకీయాలలో కూడా అధికార పార్టీ నేతలపై పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేసి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు.

ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాధ్ పై ఫైర్ అయ్యారు.

సీఎం జగన్ గురించి ట్వీట్ చేస్తూ.. 

దేశంలో అత్యంత ధనిక సీఎం జగన్ .. కానీ పెద ప్రజలు ఉన్న రాష్ట్రం ఏపీ అని సెటైర్ వేశారు.

అలానే ఏపీలో వర్గాలకు తావు లేదని.. భూమి నుండి ఇసుక వరకు, మద్యం నుండి గనుల వరకు, అడవుల నుండి కొండల వరకు, కాగితం నుండి ఎర్రచందనం వరకు రాష్ట్రం నుంచి వచ్చే వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందని రాసుకొచ్చారు.

మరోవైపు ఏపీలో పెట్టుబడుల గురించి కూడా పవన్ విమర్శనాస్త్రాలు గుప్పించారు.

అదే విధంగా మాతృ గుడివాడ అమర్నాథ్ గురించి కూడా పోస్ట్ చేస్తూ.. మన ఐటీ మరియు పరిశ్రమల మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్ మరియు చాయ్ పాయింట్లను ప్రారంభించారు, ఇప్పుడు ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం మాత్రమే వేచి ఉన్నారని అదిరిపోయే రేంజ్ లో వారి వైఫ్యల్యాన్ని దుయ్యబట్టారు.

ప్రస్తుతం జనసేనాని చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.

(Pawan kalyan) పవన్ కళ్యాణ్ ట్వీట్స్..

 

ఆక్సిమోరాన్ (నామవాచకం) – అర్థం – విరుద్ధ పదాల కలయిక.
ఉదా – ఆంధ్రప్రదేశ్ దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిచే నిర్వహించబడే పేద ప్రజలు ఉన్న రాష్ట్రం
ట్రివియా – మన ముఖ్యమంత్రి సంపద మిగతా సీఎంలందరి కంటే ఎక్కువ;
ఏపీ సీఎం, ఒక “క్లాస్” వేరు!

 

 

ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదు, ప్రజలంతా వైసీపీ రాజ్యానికి బానిసలుగా తయారయ్యారు. భూమి నుండి ఇసుక వరకు, మద్యం నుండి గనుల వరకు, అడవుల నుండి కొండల వరకు, కాగితం నుండి ఎర్రచందనం వరకు AP నుండి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలో ఉంది, నిజంగా క్లాసిక్!

 

YCP APలోని పేదలను సామాన్యతతో సంతృప్తి చెందేలా చేసింది; వారి జీవితాలు, గౌరవం, శ్రమ కొన్ని వందల డబ్బులకు అమ్ముడుపోయాయి. APలో మిడిల్ క్లాస్ అత్యంత నిర్లక్ష్యం; వైసీపీ వారిని టాక్స్ పేయింగ్ మూగ సేవకులుగా పరిగణిస్తోంది. ఏపీ నుంచి ఇన్వెస్టర్లు నిష్క్రమించారు. ఇది వైసీపీ “మాస్టర్ – క్లాస్”!

 

వైసీపీ ఆంధ్రాకు పెట్టుబడుల గలాక్సీని తీసుకురాగలిగినప్పుడు దావోస్ ఎవరికి కావాలి; మన ఐటీ మరియు పరిశ్రమల మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్ మరియు చాయ్ పాయింట్లను ప్రారంభించారు, ఇప్పుడు ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం మాత్రమే వేచి ఉన్నారు. మరో క్లాస్ చట్టం!

 

అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి, కామ్రేడ్ చారు మజుందార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి మరియు కామ్రేడ్ పుచ్చలిపల్లి సుందరయ్య వంటి ‘వర్గయుద్ధం’ గురించి మాట్లాడుతున్నారు. ఎంత వ్యంగ్యం!!

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar