Site icon Prime9

OG Movie : పవర్ స్టార్ ఓజి షూటింగ్ స్టార్ట్.. పవన్ షూటింగ్ లో పాల్గొనేది అప్పడేనా?

pawan kalyan and sujith og movie shooting started

pawan kalyan and sujith og movie shooting started

OG Movie : ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాని శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీని అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ.. ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో అప్డేట్ ఇవ్వండి అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూవచ్చారు. ఈ మేరకు  తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజి అప్డేట్ వచ్చేసింది.

తాజాగా ఓ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అయితే చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమా షూటింగ్‌ను ఇవాళ స్టార్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షూటింగ్‌ను ముంబైలో స్టార్ట్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. “ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్” OG అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ కూడా  చేసింది. ఇక ఈ సినిమాను సుజిత్ ఎంత ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా, ఈ సినిమాలో మిగతా నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ఇవ్వనుండగా.. ఈ మధ్య సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, ఆయన కలిసి కొన్ని లొకేషన్స్ చూసి వచ్చారు. రిలీజ్ చేసిన వీడియోలో సుజిత్, పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించబోతున్నాడు అనేది చిన్న గ్లిమ్ప్స్ ఇచ్చాడు. అదే విధంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో OG టైటిల్ రిజిస్టర్ చేయించారు నిర్మాత డీవీవీ దానయ్య. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మరి ఓజీ సినిమా ఎలా ఉండబోతుందనే అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ లో కొంత వరకే కనిపిస్తారని సెకండ్ ఆఫ్లో ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ నటించిన సాహో సినిమాకి .. ఈ సినిమాకి లింక్ ఉందట.. ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తారో లేదో సస్పెన్స్ గా చెబుతున్నారు. ఆ మూవీ లోని పాత్రల గురించి అయితే ప్రస్తావిస్తారని టాక్ నడుస్తుంది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ అనుభూతిని అందించేలా మూవీ మేకింగ్‌ ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే సాంగ్స్, డ్యాన్స్ లేకుండానే మూవీ రన్ అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో వచ్చిన సాహో మూవీ క్లైమాక్స్ కి కనెక్ట్ అయ్యి ఉంటుందని చెప్తున్నారు.

Exit mobile version