Janasena Yuvashakthi: ఏడాది కింద ఈ ప్రాంతాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోతే ఇప్పటి వరకూ పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదు. బాధితులు తమ బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి దోషులకు శిక్షపడేలా చేయండి అని కోరుకుంటున్నారు. మీరు నా పక్షాన నిలబడితే దోషులకు శిక్ష పడేలా నేను చేస్తాను.
చనిపోయిన విద్యార్థి తల్లి మంత్రి దగ్గరకు వెళ్లి న్యాయం చేయాలని అడిగితే ఎటకారంగా ఏంటమ్మా నేనేమైనా నీకు బాకీ ఉన్నావా అని మాట్లాడారంట. ఏంచేయాలి వీళ్లను ఇంకోసారి గెలిపిస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన నిర్వహించిన యువశక్తి సభకు భారీస్థాయిలో యువత, పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు. ఈ వేదికగా పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై, వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు.
మీకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం
సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుంది. సలహాలిచ్చేవాడు సజ్జల అయితే పూర్తిగా నాశనం అవుతుంది.
ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంత ఇది వైసీపీ సొంతం కాదు.
మనం ఇప్పటికైనా మేల్కొకపోతే, జనసేనకు అండగా ఉండకపోతే మీ జీవితాలు ఇలానే ఉండిపోతాయి.
మీ కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
వైసీపీ గూండాలకు చెబుతున్నా నేను బతికున్నంత వరకు పోరాడుతాను అన్నారు.. సంస్కార వంతంగా ఉంటే.. నా అంత సంస్కార వంతుడు ఎవరూ ఉండరు..? కానీ, రెచ్చగొడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం అన్నారు.. ఇక, నేను కులనాయకుడిని కాదు.. ఒక్క కులం కోసం కాదు, ఏపీ, తెలంగాణ అందరూ బావుండాలని కోరుకున్న వ్యక్తిని అన్నారు. వైసీపీ ఒక్క కులంతోనే నింపేసుకుంటున్నారని విమర్శించారు.. పొద్దున్నే పథకం క్రింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారాతో పట్టుకు పోతున్నారని ఆరోపించారు.. మరోవైపు.. మంచి వ్యక్తిత్వం ఉన్న వారికి గౌరవిస్తాను, జైలులో ఉన్నవారిని కాదన్న పవన్.. నేను ఒకతరాన్ని మేలు కోలుపుతున్నాను.. మేం అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తా.. వలసలు ఆపుతానని ప్రకటించారు.
నేను ఒక తరాన్ని మేల్కొల్పేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇంత ట్యాక్స్ కడుతున్న నేను డబ్బులు తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ఈసారి ఎవరైనా నేను డబ్బులు తీసుకున్నానంటే మీరే చెప్పులతో కొట్టండి. మీరు జనసేనకు అండగా ఉంటే అభివృద్ధి సాధించుకుందాం. మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. నాకు అధికారం ఇస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకోస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
Janasena Yuvashakthi: జనసేన పార్టీ పెట్టినప్పుడు నా అకౌంట్‌లో ఉన్నది రూ.13 లక్షలే.. పవన్ కళ్యాణ్
మూడు ముక్కల ప్రభుత్వం.. మూడు ముక్కల ముఖ్యమంత్రి
ఛీఛీ నా బతుకుచెడా.. మీకోసం డైమండ్ రాణి రోజా విమర్శలు కూడా పడుతున్నా- పవన్ కళ్యాణ్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/