Site icon Prime9

PackageStarJagan: లారస్ ల్యాబ్స్ ప్రమాదం: సీఎం జగన్ ప్యాకేజ్ స్టార్.. ఇది శవాలపై పేలాలు ఏరుకోవడం కాదా..?

bolishetty srinivas comment on cm jagan as pakagestarjagan

bolishetty srinivas comment on cm jagan as pakagestarjagan

PackageStarJagan: ఏపీ ప్రభుత్వ నాడు నేడు పథకం కోసం లారెస్ ల్యాబ్స్ (Laurus labs)నుంచి తీసుకున్న డబ్బులు బాధితుల కుటుంబాలకు అందజేయాలని జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు తూతూ మంత్రంగా పరిశ్రమలపై చర్యలు తీసుకుంటున్నట్టు నటించి.. ఇలా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ కింద డబ్బులు తీసుకోవడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలపై కనీస చర్యలు తీసుకోకపోతే.. భవిష్యత్ లో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయొద్దని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు ఎంత పోరాడినా.. ప్రభుత్వ తీరులో మార్పులేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలు ఎక్కువయ్యాయని ఆయన మండిపడ్డారు.

నలుగురిని కోల్పోయిన కుటుంబాలు బాధలో ఉంటే..

ప్రభుత్వం శవాల మీద పేలాలు ఏరుకోవడం అన్న పవన్ కళ్యాణ్ (pawan kalyan) మాటలు నిజమేనని ఆయన తెలిపారు.

నలుగురిని కోల్పోయిన కుటుంబాలు బాధలో ఉంటే.. 15 రోజులు అవ్వకుండానే ప్రమాదానికి కారణమైన సంస్థ ప్రతినిధులు సీఎం జగన్ (CM Jagan) ని కలిసి విరాళం ఇవ్వడం విడ్డారమన్నారు.

ముఖ్యమంత్రి నే ఇలాంటి సంస్థ ను సపోర్ట్ చేస్తుంటే.. కింది స్థాయి అధికారులు ఎలా పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు. ‘గతంలో పవన్ ఏపీ ప్రభుత్వం శవాలపై పేలాలు ఏరుకుంటోందని అన్నారు.. ఇప్పుుడు అది నిజం అయింది… నూటికి నూరు శాతం పవన్ నిజాన్ని నమ్ముతారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం’అని తెలిపారు.

తరచూప్రమాదాలు.. సేఫ్టీ ఏదీ?

విశాఖ ప్రాంతంలోని ఫార్మా పరిశ్రమల్లోనూ, ఇతర పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలను పరిశీలించాల్సిన అధికారులు, సంబంధిత కమిటీల సభ్యులు ఏ మేరకు పని చేస్తున్నారనే ప్రశ్న.. ప్రమాదం జరిగిన ప్రతిసారీ తలెత్తుతోంది. విశాఖ ప్రాంతాంలోని ప్రతి ఫార్మా పరిశ్రమల్లోనూ సేప్టీ ఆడిట్ నిర్వహించాలి. 2019 నుంచి 2022 వరకు ఫార్మాసిటీల్లో 11 ప్రమాదాలు జరిగాయి. సుమారు 35 నుంచి 40 వరకు మరణాలు నమోదయ్యాయి అంటే పరిస్థితి తీవ్రత ఎంతో ఉందో అర్థం అవుతోంది.


ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి పరవాడ లోని జేఎన్ ఫార్మాసిటీలో డిసెంబర్ 26న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్(Laurus labs) యూనిట్ 3లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనం కాగా, మరొకరు 80 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబందించి లారస్ ల్యాబ్స్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ నిర్వహణలో నిర్లక్ష్యం తో పాటు తదితర కారణాలను చూపిస్తూ పలు సెక్షన్ కింద కేసు పెట్టారు. అదే విధంగా ఈ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ కంపెనీపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే చర్యలు మాట పక్కన పెడితే.. ప్రభుత్వం లారెస్ సంస్థ అడుగులకు మడుగులొత్తుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి…

ప్యాకేజీ స్టార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి: శవాలపై పేలాలు ఏరుకోవడం అంటే ఇదే.. ఇందుకే పవన్ కళ్యాణ్ తిట్టేది..

ఈ ఏడాది హాట్ స్టార్ కి షాక్.. ఆ ఓటీటీలో ఐపీఎల్ స్ట్రీమింగ్.. ఎన్ని భాషల్లో అంటే?

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version