OTT Release: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఇవే.. మీరు ఓ లుక్కేయండి

OTT Release: ఈ వారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

OTT Release: కరోనా తర్వాత నుంచి చాలామంది ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు.. వ్యూయర్స్‌ అభిరుచికి తగ్గట్టుగా ప్రతీ వారం కొత్త చిత్రాలను విడుదల చేస్తున్నాయి. ఈ వారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

 

క్యూట్‌ లవ్‌ స్టోరీ (OTT Release)

నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించాడు. సన్‌నెక్ట్స్‌ వేదికగా మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మీటర్‌

కిరణ్‌ అబ్బవరం నటించిన చిత్రం మీటర్. రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అతుల్య కథానాయికగా నటించింది. ఈ సినిమా భాక్సాఫిస్ వద్ద మిశ్రమ ఫలితాలను చూసింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మే 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌

మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ మ్యాచ్ ఫిక్సింగ్. విశ్వంత్‌, వసంతి కృష్ణన్‌, ప్రగ్యా నయన్‌, అభిజీత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను సీనియర్‌ దర్శకుడు ఇ.సత్తిబాబు తెరకెక్కించారు. ఈ సినిమా‘ఈ టీవీ విన్’లో మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

‘16 ఆగస్టు 1947’న ఏం జరిగింది?

గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ సమర్పణలో రూపొందించిన చిత్రం ‘ఆగస్టు 16.. 1947’. ఎన్‌.ఎస్‌.పొన్‌కుమార్‌ తెరకెక్కించారు. రేవతి శర్మ, పుగాజ్‌, రిచర్డ్‌ ఆష్టన్‌, జాసన్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. టెంట్‌కొట్ట ఓటీటీ ఫ్లాట్‌ఫాం వేదికగా మే 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

శాంక్చురీ (మూవీ) మే 4
ది లార్వా ఫ్యామిలీ(యామినేషన్‌) మే 4
తూ ఝూటీ మై మక్కార్‌ (హిందీ) మే 5
3 (తెలుగు) మే 5

అమృతం చందమామలో (తెలుగు) మే 5
యోగి (తెలుగు) మే5
రౌడీ ఫెలో (తెలుగు) మే 5
తమ్ముడు (తెలుగు) మే 5

జీ 5

ఫైర్‌ ఫ్లైస్‌ (హిందీ సిరీస్‌) మే 5
షెభాష్‌ ఫెలూద (బెంగాలీ)మే 5

 

కరోనా పేపర్స్‌ (మలయాళ చిత్రం ) మే 5
సాస్‌ బహూ ఔర్‌ ఫ్లమింగో (హిందీ) మే 5