Ex CM Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ మార్పుపై అడిగిన ఓ స్పందనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానంగా ఓ నవ్వు నవ్వుతూ వెళ్లిపోయారు. ఈ ఘటన ఇంద్రకీలాద్రిలో చోటుచేసుకొనింది.
దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని మాజీ సిఎం చంద్రబాబు సతీ సమేతంగా దర్శించుకొన్నారు. ఆలయ అధికారులు మాజీ సీఎంకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారికి బాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల ఆశీర్వచనాలను అందుకొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులతో ఆ నాడు రాజధాని ప్రకటించామన్నారు. అధికారంలోకి వచ్చని తర్వాత నేటి ప్రభుత్వం మాట మార్చిందన్నారు. మాట తప్పేవారిని దుర్గమ్మ క్షమించదన్నారు. దుష్ట శక్తులను తుదముట్టించే శక్తి కనకదుర్గమ్మకు ఉందన్నారు. అమరావతిపై రోజుకోమాట వైకాపాకు తగదని తెదేపా అధినేత హితవు పలికారు. అమరావతి ఏర్పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సంకల్పంగా, దేవతల ఆశీర్వాదముగా తెలిపారు.
ఇది కూడా చదవండి:Thadepally Gudem: మహా పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు