Site icon Prime9

National Herald case: ముగిసిన సోనియాగాంధీ ఈడీ విచారణ

New Delhi: నేషనల్​ హెరాల్డ్​ కేసులో సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు గంటలపాటు విచారించిన ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ అధికారులు 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని, తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు. ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. మళ్లీ సోమవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.

మరోవైపు నేషనల్​ హెరాల్డ్​ కేసులో సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్​ తీవ్రంగా మండిపడుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసనలు చేపట్టాయి. రోడ్లపై ఆందోళనకు దిగిన కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ, చండీగడ్ సహా పలు ప్రాంతాల్లో చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఢిల్లీ ఆందోళనల్లో కారును తగులబెట్టారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కీలక నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు చేపట్టిన 75మంది ఎంపీలను పోలీసులు గృహనిర్బంధం విధించారు.

Exit mobile version