Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న మరణవార్త తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించి, 23 రోజులుగా మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఇక శనివారం నాడు ఆయన శివైక్యం చెందారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపై సంతాపం తెలియచేస్తున్నారు.
కొద్ది సేపతి క్రితమే తారకరత్న పార్థివదేహం బెంగుళూరు నుంచి హైదరాబాద్ మోకిలాలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. నేడు ఆదివారం ఇంటి వద్దే ప్రముఖుల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచుతారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో అభిమానులు, ప్రజల సందర్శనార్థం తారకరత్న భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. అనంతరం తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. తారకరత్నకు తండ్రి మోహనకృష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.
ఇటీవల కొంతకాలంగా తారకరత్న రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఏపీలో టీడీపీకి అందరం అండగా నిలవాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. రానున్న జనరల్ ఎలక్షన్‌లో ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. టీడీపీని గెలిపించి.. చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు తారక్. తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారక రత్న చెప్పడంతో.. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు ఓ సీటు కేటాయిస్తారని ప్రచారం జరిగింది.
తారకరత్న టీడీపీ తరపున గతంలో ప్రచారం కూడా చేశారు. తారకరత్నకు గన్నవరం నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అనుకోని రీతిలో ఆయనకు ఇలా జరగడం అందరినీ కలచివేసింది. గత 23 రోజులుగా తారకరత్న కోలుకుని క్షేమంగా తిరిగిరావాలని, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ శ్రేణులు, అభిమానులు కోరుకున్నారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు.
ఎన్టీఆర్ మూడో కుమారుడు నందమూరి మోహన కృష్ణ. ఆయన కుమారుడు తారకరత్న.. తారకరత్నకు ఒక పాప. అలేఖ్యా రెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు తారకరత్న. నందీశ్వరుడు చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు అలేఖ్యా రెడ్డి. 2001లో ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయ్యారు. ఒక వెబ్ సిరీస్, 22 చిత్రాల్లో నటించారు. 2006 తర్వాత మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2009లో అమరావతి చిత్రంతో మళ్లీ సినీ జీవితాన్ని మొదలుపెట్టారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/