Site icon Prime9

Nagababu: మగ ముత్తైదువలు మొరగడం మొదలు పెట్టారు వాయినాలు ఇచ్చి పంపండి- నాగబాబు

nagababu-tweet-about-ycp-leaders

nagababu-tweet-about-ycp-leaders

Nagababu: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఇప్పటికే అక్కడ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాడీ వేడీ విమర్శలు కనిపిస్తున్నాయి. ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసై వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.  నిన్న శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో యువశక్తి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ మీటింగ్ లో సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. దీంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నోళ్లకు పని చెబుతున్నారు.

 

మగ ముత్తైదువలకు వాయినాలు.. నాగబాబు(Nagababu)

వైసీపీ నేతలు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, తదితరులు ట్విట్టర్ లోనూ, ప్రెస్ మీట్ లోనూ పవన్ పై వారి వారి శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు దీనిపై స్పందించారు. మగ ముత్తైదువలు కుక్కల్లాగా మొరగడం మొదలు పెట్టారు.. వాయినాలు ఇచ్చి పంపండి అంటూ ట్విట్టర్ వేదికగా నాగబాబు(Nagababu) సెటైర్లు వేశారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందింస్తూ ఘాటు వ్యాఖ్యలు చే శారు.

సభలో పవన్ కళ్యాణ్ అనేక అబద్ధాలు చెప్పినప్పటికీ, ఒకటి మాత్రం నిజం చెప్పాడని అన్నారు.

మరోసారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని చెప్పాడని, అందులో వాస్తవం ఉందని ఎద్దేవా చేశారు.

గతంలో జగన్ చేతిలో ఒకసారి బడితెపూజ జరిగింది, ఈసారి కుక్కచావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడన్నారు.

తానెందుకు చంద్రబాబు సంకలో దూరాల్సి వస్తుందో చెప్పడానికే పవన్ ఈ సభ ఏర్పాటు చేశాడు. యువతకు ఉద్యోగాలు, యువతకు ఉపాధి అంతా వట్టిదే. జగన్ మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటే పవన్ బాగా ఊగిపోతున్నాడు అని ఆరోపించారు.

పవన్‌ కళ్యాణ్ కు మంత్రి రోజా కూడా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రెండుసార్లు గెలిచిన నేను.. రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అని మండిపడ్డారు. అయినా ప్రజల కోసం తప్పట్లేదంటూ ట్వీట్‌ చేశారు.  మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కూడా పవన్‌పై విమర్శలు గుప్పించారు. తనకు తెలిసింది పోరాటమే.. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అన్నారు. క్యా బాత్‌ హై అని పవన్‌ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. పవన్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.. నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం వైకాపా – జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version