Site icon Prime9

Mahesh Babu: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన మహేష్ బాబు .. అనిల్ కపూర్ తో డాన్స్ స్టెప్స్ వైరల్ ..

mahesh-babu viral dance video in animal movie pre release event

mahesh-babu viral dance video in animal movie pre release event

Mahesh Babu: టాలీవుడ్ హీరో మహేష్ బాబు యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటేస్ట్ సినిమా యానిమల్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే టీజర్ , ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్ కి అంచనాలు భారీగా పెంచేశారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. కానీ ట్రైలర్ మాత్రం మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇదివరకు ఎన్నడూ చూడని మాస్ అవతారంలో రణబీర్ కనిపించడంతోపాటు.. తండ్రికొడుకుల మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు యానిమల్ సినిమాను చూసేందుకు నార్త్ లోనే కాకుండా సౌత్ అడియన్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేయగా ,ఈ వేడకకు వందల సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. అంతమంది జనాన్ని చూసిన బాలీవుడ్ స్టార్స్ అవాక్కయ్యారు.

ఈ వేదికపై బాబీ డియోల్ కపూర్ మాట్లాడుతూ.. మహేష్ బాబు కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లోని పద్మాలయ స్టూడియోలో షూటింగ్ చేశానని.. అప్పుడు మహేష్ బాబు సినిమా ప్రారంభోత్సవానికి కృష్ణ తనను ఆహ్వానించారని అన్నారు. నీ సినిమా ముహూర్తానికి మీ డాడీ నన్ను ఆహ్వానించారు గుర్తుందా అని మహేష్ బాబును అడగ్గా.. గుర్తుందని అన్నారు మహేష్. తర్వాత అనిల్ కపూర్ కాసేపు తెలుగులో మాట్లాడేందుకు ట్రై చేశారు. తన తొలి సినిమా తెలుగులోనే చేశానని,వంశవృక్షం సినిమా తన ఫస్ట్ మూవీ అని.. బాపు గారు తనను ఇండస్ట్రీకి పరిచయం చేశారని అన్నారు. అలాగే నమ్రతాను భార్యగా పొందడం మహేష్ బాబు అదృష్టమన్నారు. భార్య, పిల్లలు అద్భుతమైన కెరీర్ తో మహేష్ ముందుకు వెళ్తున్నారని.. ఫ్యామిలీ మ్యాన్.. అందుకే అతడిని అందరు అంతగా ఇష్టపడుతున్నారని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమే రాజమౌళి మోటివేట్ చేశారని అన్నారు. ఆ తర్వాత బాబీ డియోల్, అనిల్ కపూర్ ఇద్దరిని డాన్స్ చేయాలని కోరింది యాంకర్ సుమ.

దీంతో మహేష్ బాబు పాటకు డాన్స్ చేస్తామని అన్నారు అనిల్ కపూర్. ఇక రణబీర్, మహేష్ వేదికపైకి రావాలని అన్నారు. దీంతో దండం పెడుతూ నా వల్ల కాదన్నట్లు తప్పించుకునేందుకు ట్రై చేశారు మహేష. దీంతో నేను మీకంటే సీనియర్.. వస్తారా రారా అని అన్నారు అనీల్ కపూర్. దీంతో రణబీర్, మహేష్ ఇద్దరూ స్టేజ్ పైకి వెళ్లారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ .. మహేష్ బాబు పాటకు డాన్స్ చేశారు.ఇక వేదిక పై పోకిరి సినిమాలోని ‘డొలె డొలె’ సాంగ్ వేశారు. ఆ పాట హుక్ స్టెప్ ని మహేష్ బాబు అలా వేసి మైమరపించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, రణబీర్ మహేష్ తో కలిసి కూడా పాటకు స్టెప్ వేశారు. గతంలో ‘సర్కారు వారి పాట’ మూవీ సక్సెస్ ఈవెంట్ లో మహేష్ డాన్స్ వేసి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇలా వేదిక పై డాన్స్ వేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

 

Exit mobile version