Site icon Prime9

KTR: అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన కేటీఆర్‌ – సీఎంను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌

KTR Tweet On Allu Arjun Arrest: సినీ హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖండించారు. ప్రత్యక్ష ప్రమేయం లేని కేసులో ప్రత్యేక్షంగా ప్రమేయం లేని నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ చేయడం ప్రభుత్వ అభద్రతకు పరాకాష్టాని అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై బాధితులకు పూర్తిగా సానుభూతి తెలిపారు.

కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. జాతీయ పురస్కారం అందుకు్న అల్లు అర్జున్‌ అరెస్ట్‌ చేయడం.. పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని అర్థమైపోతుంది. ఈ ఘటనకు నేరుగా బాధ్యుడి కానీ అల్లు అర్జున్‌ సాధారణ నేరస్తుడిగా ట్రీట్‌ చేయడం సరికాదన్నారు. . అలా అయితే హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్‌ రెడ్డిని కూడా అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కాగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో వేసిన డిసెంబర్‌ 4న రాత్రి వేసిన పుష్ప 2 ప్రీమియర్స్‌కి వేసిన సందర్భంగా సినిమా చూసేందుకు అల్లు అర్జున్‌ వచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో దిల్‌షుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అయితే పోలీసులు సీపీఆర్‌ చేయడం అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. మహిళ మృతితో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనలో A1 నిందితులుడగా సంధ్య థియేటర్‌ యాజమాన్యాన్ని చేర్చారు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్‌ యజమానితో పాటు ఇద్దరు మేనేజర్లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే అల్లు అర్జున్‌పై కూడా నాలుగు సెక్షన్ల కింది కేసు నమోదు చేసి నేడు అరెస్ట్‌ చేశారు. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో బన్నీ చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరిక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆయనను రిమాండ్‌కు పంపేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version