Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదు అవుతోంది. లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 28లక్షల 67వేల 650 క్యూసెక్కులుగా ఉంది. దీంతో లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 15, 2022 / 12:05 PM IST

Kaleshwaram project: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదు అవుతోంది. లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 28లక్షల 67వేల 650 క్యూసెక్కులుగా ఉంది. దీంతో లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ కి 14లక్షల 77వేల 975 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అధికారులు అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. త్రివేణి సంగమం వద్ద నది 15.90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. దీంతో మహదేవపూర్, కాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పుష్కరఘాట్‌లను ముంచెత్తిన వరద నీరు సమీపంలోని ఇళ్లలోకి చేరింది. ముంపు ప్రాంతాల్లోని నివాసితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాళేశ్వరం ఘాట్‌ వద్దకు ఎవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ వరదల కారణంగా 70కిపైగా గ్రామాలు జలదిగ్భందంలో మునిగిపోయాయి.