Janasena Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించిన అనంతరం సన్నిధానంలో వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకే పవన్ కళ్యాణ్ అమ్మ వారిని దర్శించుకోనుండగా పలు కారణాల రీత్యా దర్శనం ఆలస్యం అయ్యింది.
మంగళవారం ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం ధర్మపురి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. నారసింహ అనుష్టుప్ యాత్ర ప్రారంభించి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా విజయవాడకు బయలుదేరారు.
కాగా ఇప్పటికే ఆలయం వద్ద పవన్ అభిమానులు భారీ ఎత్తున చేరుకొని పవన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి నుంచి విజయవాడకు బయల్దేరారు.
కాగా ముందుగా వారాహి వాహనాన్ని మంగళగిరి నుంచి విజయవాడకు తీసుకువచ్చారు.
ఈ క్రమంలో అడుగుడుగునా జనసేన అభిమానులు, నేతలు వారాహి తో సెల్ఫీ లు తీసుకునేందుకు పోటెత్తారు.
పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
అభిమానుల ఒత్తిడిని గుర్తించి బారికేడ్లను ఏర్పాటు చేశారు.
కాగా మనగలవారం నాడు పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజ కార్యక్రమాల అనంతరం మీడియా తో పవన్ మాట్లాడారు.
మరోవైపు తెలంగాణ రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది.
తెలంగాణ నేతలతో సమావేశం..
ఈ మేరకు తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
7-14 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. అదే సమయంలో పొత్తులకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు.
25 నుంచి 40 అసెంబ్లీ సీట్లలోనూ బరిలోకి దిగిందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.
ప్రతి నియోజకవర్గం లోనూ ఒకటికి రెండుసార్లు పర్యటిస్తానని జనసేనాని చెప్పారు.
కొన్ని కారణాలతో జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నామని.. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
తన రాజకీయ ప్రస్థానంతో పాటే.. జనసేన పుట్టుక కూడా తెలంగాణ గడ్డపై నుంచే మొదలైందన్నారు.
పరిమితస్థాయిలోనే పోటీ చేస్తూ ఆట మొదలుపెడుతామన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలన్నది తన కోరికని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీలో రాజకీయాల్లో పొత్తులపై అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన సిద్దాంతాలకు అనుగుణంగా ఉన్న పార్టీలో కలిసి ముందుకెళతానని తనతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటానంటూ వ్యాఖ్యానించారు.
పొత్తులు కుదరకపోతే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుంది అంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నామన్న పవన్.. ‘వైసీపీ’వ్యతిరేక ఓట్లు చీలకూడదని అన్నారు.
ఎన్నికల దగ్గరపడ్డాక పొత్తుల గురించి ఆలోచిస్తామని..ప్రస్తుతం పొత్తుల గురించి ఆలోచించే సమయం కాదని అన్నారు.
అలాగే వారాహి అనే పేరుకు అర్థం చెప్పిన పవన్ ‘వారాహి’అంటే.. దుష్టులను శిక్షించేది అంటూ వివరించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/