Site icon Prime9

Janasena Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ కి “అప్పు రత్న” బిరుదు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

janasena chief counter to ap cm jagan and named as appu ratna

janasena chief counter to ap cm jagan and named as appu ratna

Janasena Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.

అప్పులతో ఆంధ్రప్రదేశ్ పేరు ను మారుస్తున్నారని జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.

ఏపీ సంపద, ప్రగతిని కుక్కలకు వెళ్లనివ్వకండి కానీ మీ వ్యక్తిగత సంపదనను పెంచుకోవడం మర్చిపోవద్దని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

మీ వ్యక్తిగత సంపద, ఆస్తులు, ఎప్పటికీ అది ఆత్మే అంటూ వ్యాఖ్యలు చేశారు.

భారతరత్న మాదిరిగానే అప్పు రత్న అవార్డును సీఎం జగన్ కు ఇస్తున్నట్టుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఇందుకు సంబంధించి ఒక కార్టూన్ తో ఉన్న ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్ లో పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు.

అప్పు రత్న.. వైఎస్  జగన్ – పవన్ కళ్యాణ్(Janasena Pawan Kalyan)..

ఈ మేరకు ట్విట్టర్ లో..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

2022 డిసెంబర్ మాసంలో పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై సమాధానం ఇచ్చింది.

2018లో ఏపీ ప్రభుత్వం అప్పులు 2,29,333.8 కోట్లు ఉండేది. అయితే 2022 నాటికి 3,60,333.4 కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

2017-18లో అప్పలు శాతం 9.8 శాతంగా ఉండేది. కానీ 2020-21 నాటికి ఈ అప్పు ల శాతం 17.1 శాతానికి చేరిందని కేంద్రం వివరించింది .

స్థూల జాతీయ ఉత్పత్తిలో 2014లో అప్పుల శాతం 42.3 శాతంగా ఉంది.

తొమ్మిది మాసాల్లో జగన్ సర్కార్ 55,555 కోట్లు అప్పులు చేసిందని ఈ పోస్టులో జనసేనాని విమర్శలు చేశారు.

2021 నాటికి జాతీయ స్థూల ఉత్పత్తిలో అప్పులు 36.5 శాతంగా ఉన్నాయని ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం పార్లమెంటు వేదికగా జవాబిచ్చింది.

 

‘అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు.

కీప్ ఇట్ అప్! మీ సంపదను పెంచుకోవడం మాత్రం మర్చిపోకండి. రాష్ట్ర అభివృద్ధి, సంపదను కుక్కలపాలు చేయండి.

కానీ, మీ సంపద, ఆస్తుల్ని మాత్రం పెంచుకోండి. అదే ముఖ్యమంత్రి స్ఫూర్తి’’ అని పవన్ ట్వీట్ చేశారు. దీనికి ఒక కార్టూన్ కూడా జత చేశారు.

అందులో సీఎంకు ‘అప్పురత్న’ అవార్డు ఇస్తున్నట్లుగా ఉంది. ఈ కార్టూన్‌లోనే తొమ్మిది నెలల్లో ఏపీ రూ.55,555 కోట్లు అప్పు చేసినట్లు పేర్కొన్నారు.

ఇది వైసీపీ సర్కారు రికార్డుగా పవన్ అభివర్ణించారు. తాజా నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీ అప్పు రూ.55 వేల కోట్లు దాటింది.

అంటే సగటున రోజుకు రూ.205 కోట్ల చొప్పున ఏపీ అప్పు చేస్తోంది. నెలకు రూ.6,172 కోట్లను అప్పుగా తీసుకుంటోంది.

దీంతో ఏపీ అప్పుల భారం పెరిగిపోతోంది. దీనిపైనే పవన్ తాజాగా ట్వీట్ చేశారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version