IPL 2023: ఐపీఎల్ వేడుకకు తెరలేచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన గుజరాత్.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో రుతురాజ్ 92 పరుగులు చేశాడు. ఇక చివర్లో ధోని బ్యాట్ తో మెరిశాడు. 7 బంతుల్లో ఫోర్, సిక్సర్ తో 14 పరుగులు చేశాడు. రుతురాజ్ మినహా చెన్నైలో ఏ ఒక్క బ్యాటర్ సరిగా రాణించలేదు.
ఇక బౌలింగ్ లో షమి, రషీద్ ఖాన్, జోసెఫ్ తలో రెండు వికెట్లు తీశారు. జోష్ లిటిల్ ఓ వికెట్ పడగొట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. ఈ ఓవర్ లో ఇదో రెండో వికెట్. రెండు బంతుల్లో జడేజా ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అల్ జారీ బౌలింగ్ లో శంకర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
18 ఓవర్లలో.. చెన్నై 155 పరుగలు చేసింది. క్రీజులో ఎంఎస్ ధోని, దూబే ఉన్నారు.
సెంచరీ వైపు దూసుకెళ్తున్న రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. దీంతో చెన్నై ఐదో వికెట్ కోల్పోయింది. 50 బంతుల్లో.. 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. జోసెఫ్ బౌలింగ్ లో శుభ్ మన్ గిల్ కి క్యాచ్ ఇచ్చి గైక్వాడ్ వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్ కే ఐదు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
మెుదటి ఐపీఎల్ లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపుతున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 40 బంతుల్లో 78 పరుగులు చేసి.. క్రీజులో కొనసాగుతున్నాడు. ఇందులో 8 సిక్సర్లు, 4ఫోర్లు ఉన్నాయి. నాలుగో వికెట్ రూపంలో అంబటి రాయుడు ఔటయ్యాడు. 12 బంతుల్లో 12 పరుగులు చేసి క్లీన్ బౌల్డయ్యాడు.
ప్రస్తుతం సీఎస్ కే 14 ఓవర్లకు 132 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్, శివమ్ దూబే ఉన్నారు.
పది ఓవర్లకు సీఎస్ కే 90 పరుగులు చేసి.. మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్లతో చెలరేగుతున్నాడు. రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు.
సీఎస్ కే మూడో వికెట్ కోల్పోయింది. ఆ జట్టు కీలక ఆటగాడు బెన్ స్టోక్స్ తక్కువ పరుగులకే ఔటయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. 6 బంతుల్లో స్టోక్స్ 7 పరుగలు చేసి పెవిలియన్ చేరాడు. రషీద్ ఖాన్ రెండో వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం స్కోర్ 70-3
IPL 2023: సీఎస్ కే రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్ లో అలీ క్యాచ్ రూపంలో ఔటయ్యాడు. మోయిన్ అలీ 17 బంతుల్లో 23 పరుగులు చేశాడు.
IPL 2023: ఐదు ఓవర్లు ముగిసేసరికి సీఎస్ కే 46-1 స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రుతు రాజ్, అలీ కొనసాగుతున్నారు
IPL 2023: మూడు ఓవర్లు ముగిసే సరికి సీఎస్ కే వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్, మోయిన్ అలీ ఉన్నారు.
IPL 2023: ఈ సీజన్ లో మెుదటి వికెట్ పడింది. షమి బౌలింగ్ లో కాన్వై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాన్వై 6 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు
రెండో ఓవర్ ముగిసేసరికి చెన్నై 13 పరుగులు చేసింది. ఈ ఓవర్లో రెండు ఫోర్లు వచ్చాయి.
IPL 2023: తొలి ఓవర్ లో చెన్నై కేవలం రెండు పరుగులు మాత్రమే చేసింది. తొలి ఓవర్ వేసి మహమ్మద్ షమి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వై క్రీజులోకి వచ్చారు. గుజరాత్ తరపున షమీ తొలి ఓవర్ వేస్తున్నాడు
చెన్నై సూపర్ కింగ్స్
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని (కెప్టెన్ కమ్ వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, దీపక్ చాహర్, రాజవర్ధన్ హంగర్గేకర్
IPL 2023: ఐపీఎల్ వేడుకకు సమయం ఆసన్నమైంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన గుజరాత్.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి మరికాసేపట్లో తెరలేవనుంది. ఈ వేడుకలు బీసీసీఐ పూర్తి ఏర్పాట్లు చేసింది. అహ్మదాబాద్ వేదికగా మాజీ ఛాంపియన్.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించే.. ప్రారంభోత్సవ వేడుకలో సెలబ్రిటీలు చిందులు వేశారు.
నాటు నాటు సాంగ్ కు రష్మిక స్టెప్పులు వేసింది. రష్మిక తన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించింది.
ఐపీఎల్ ప్రారంభవేడుకలో తమన్న భాటియ స్టెప్పులతో అదరగొట్టింది. వివిధ భాషల పాటలకు స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించింది.
Sound 🔛@iamRashmika gets the crowd going with an energetic performance 💥
Drop an emoji to describe this special #TATAIPL 2023 opening ceremony 👇 pic.twitter.com/EY9yVAnSMN
— IndianPremierLeague (@IPL) March 31, 2023