Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సామాన్య ప్రజలను సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. కుప్పంలో చికిత్స అనంతరం బెంగుళూరుకి తరలించారు. వైద్యులు ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది. అయితే నటసింహం బాలకృష్ణకి – తారకరత్నకు ఉన్న అనుబంధమే వేరు. బాబాయ్‌కి అబ్బాయి మీద ఎంత ప్రేమ ఉందో.. అబ్బాయికి బాబాయ్ మీద కూడా అంతే ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆ ప్రేమ కారణంగానే హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు అబ్బాయ్ దగ్గరే ఉండి అన్నీ తానై చూసుకున్నారు బాలకృష్ణ.
తారకరత్న కుప్పకూలిన రోజున చెవిలో మృత్యుంజయ మంత్రం జపించారు. అలాగే చిత్తూరు జిల్లాలో మృత్యుంజయ అఖండ దీపం కూడా వెలిగించారు. అన్ని దేవుళ్లకు పూజలు చేయించారు. విదేశాల నుంచి నిపుణులైన వైద్యుల్ని పిలిపించి మరీ చికిత్స చేయించారు. తారకరత్నను బతికించుకునేందుకు మానవ ప్రయత్నాలు అన్నీ చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
అలాగే బాబాయ్ సిగ్నేచర్‌ను ఒంటిపై టాటూగా వేయించుకున్నారు తారకరత్న. పైన సింహం బొమ్మ.. దిగువన బాలయ్య సిగ్నేచర్ ఉన్న టాటూ ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాదు.. బాలయ్య ఎలాగైతే నాన్నగారి పేరును స్మరిస్తారో.. అలానే తారకరత్న బాల బాబాయ్.. బాల బాబాయ్ నిత్యం పరితపించేవారని ఆయనతో దగ్గరిగా మెలిగిన సన్నిహితులు చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు నటిస్తున్న అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా నటించడానికి అంగీకరించారు తారకరత్న. ఈ సినిమాలో నటించి ఉంటే, తారకరత్న కెరీర్ ఇంకో రకంగా ఉండేదని అంటున్నారు విశ్లేషకులు. గతంలో నారా రోహిత్ నటించిన రాజా చేయి వేస్తే సినిమాలో కూడా ప్రతినాయకుడి పాత్ర పోషించారు తారకరత్న.
అయితే తారకరత్నకు ఉన్న ఓ కోరిక తీరకుండానే మరణించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తారకరత్నకు బాబాయ్ బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని తారకరత్న చాలా సార్లు ప్రస్తావించారు. తన బాబాయ్ బాలయ్యతో తారకరత్న క్లోజ్ గా ఉండేవారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన బాబాయ్ బాలకృష్ణతో కలిసి నటించాలని ఉందని, ఆయన సినిమాల్లో చిన్న పాత్ర అయినా సరే చేస్తానని చెప్పారు. దీంతో బాలకృష్ణతో కలిసి నటించాలనే కోరిక తీరకుండానే తారకరత్న కన్నుమూయడం బాధాకరం అని నందమూరి అభిమానులు అంటున్నారు. ఈ ఇద్దర్నీ కలిసి ఒకేసారి తెరపై చూసే అదృష్టం లేకపోయింది అని బాధపడుతున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బాలయ్య తారక రత్నను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా. నందమూరి అభిమానులకు, టిడిపి కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి అని రాసుకొచ్చారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/