Site icon Prime9

Ustaad Bhagath Singh : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పిచ్చి పీక్స్ కి వెళ్ళే న్యూస్ చెప్పిన డిఎస్పీ..

interesting update from pawan kalyan ustaad bhagath singh movie

interesting update from pawan kalyan ustaad bhagath singh movie

Ustaad Bhagath Singh పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రంలో అశుతోష్ రానా, కెజిఎఫ్ అవినాష్, నవాబ్ షా లాంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తోడయ్యాడు.

గతంలో హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్- దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఇక ఇప్పుడు అదే కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఇట్టే వైరల్ గా మారిపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ముఖ్యంగా సెట్ లో ఉన్న పవన్ ఫోటోలు కూడా నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ తెలిపారు.. గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి మే 11 కు గబ్బర్ సింగ్ వచ్చి 11 ఇయర్స్ కావడంతో.. ఆరోజును పురస్కరించుకొని.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ముందు నుంచి కూడా మే 11 న ఉస్తాద్ అప్డేట్ వస్తుందని అభిమానులు.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన విషయం తెల్సిందే. అనుకున్నట్లుగానే ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు అయ్యింది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. మరి ఈ ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలంటే.. మే 11 వరకు ఆగాల్సిందే.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో క్రిష్ జాగర్లమూడి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం “హరి హర వీర మల్లు” కూడా ఒకటి. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియన్ మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పలువురు టాలీవుడ్, బాలీవుడు తారాగణం ప్రముఖ పాత్రలు పోషించనున్నారు. అలానే సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, పవన్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అది ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 28న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

Exit mobile version