Sara Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు.. యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుశాంత్ సింగ్ సరసన ‘కేదార్నాథ్’ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకుంన్న ఈ భామ.. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకొని తన ఐదేళ్ల కెరీర్ లోనే ఈ ముద్దుగుమ్మ దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటించింది.
ఇక ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలతో అలరించింది. ‘గ్యాస్ లైట్’, ‘జర హట్కే జర బచ్కే’ చిత్రాలతో పాటుగా రీసెంట్ గా ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సినిమాలో కామియో అపియరెన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం సారా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. అలానే సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటో తో ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.
బీ టౌన్ లో ఈ అమ్మడి హాట్ ఫోటోస్ గట్టిగానే ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి. అయితే తాజాగా ఇండియన్ కల్చర్ వీక్ 2023లో అదిరిపోయే మెస్మరైజింగ్ లుక్‌లో హీరో ఆదిత్యా రాయ్ కపూర్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. ట్రెడిషనల్ వేర్ లో క్లివేజ్ షో తో కేక అనిపించిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. దీంతో సారాని టాలీవుడ్ కి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మరో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ “దేవర” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక త్వరలోనే ఈ బ్యూటీ కూడా తెలుగు తెరకు పరిచయం అవ్వడం గ్యారంటీ అని భావిస్తున్నారు.. ఆ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి..