Pawan Kalyan OG Movie : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాని శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజి అప్డేట్ వచ్చేసింది. ఇటివలే గ్రాండ్ లాంచ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బాంబేలో స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వీక్ నుంచి “OG’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యింది అనే విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అంటే..?
ఇందులో సుజిత్, పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించబోతున్నాడు అనేది చిన్న గ్లింప్స్ ఇచ్చాడు. ఈ మేరకు గ్లింప్స్ ని గమనిస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో అని క్లూ ఇచ్చాడు. వీడియో ప్రారంభంలో ఓ సీన్ పేపర్ వస్తుంది. అందులో ముంబైలో ప్రైవేటు పోర్ట్ నైట్ ఎఫెక్ట్ లో సీన్ ఓపెన్ చేస్తే… ఒక సిగరెట్ వెలిగింది, ఆ ఫైర్ లో గన్నులు పట్టుకోని డంగి, ఫైజాల్ ఇద్దరూ రివీల్ అయ్యారు. ఈ ఇద్దరూ కోటకి ఎంట్రెన్స్ లో లాక్ చేసి ఉన్న ఒక పెద్ద గేటు దగ్గర నిలబడి ఉన్నారు. “వందకి పైగా మనుషులు ఆయుధాలతో ఈ కోటకి కాపలాకాస్తున్నారు. వాళ్లని దాటుకోని అతను కోటలోకి ప్రవేశించాలి అనుకుంటే అది అతని మూర్ఖత్వం’ అన్నాడు డంగి. ఇంతలో పోర్ట్ నుంచి బుల్లెట్స్ సౌండ్ వినిపించాయి, ఫైజల్-డంగి సౌండ్ వచ్చిన వైపు చూస్తే వాళ్లకి ఫైర్ చుట్టూ ముట్టడం కనిపించింది. అది అర్ధం చేసుకునేలోపు ఇద్దరి ముందు ఒక స్మోక్ బాంబ్ వచ్చి పడింది. ఆ స్మోక్ ని చీల్చుకుంటూ సిల్హౌట్ లో ఒక మనిషి రావడం డంగి, ఫైజల్ గమనించారు. ఎవరు వస్తున్నారు అనేది అర్ధంకాని ఫైజాల్…”నువ్వు ఏం చూసావ్” అని డంగిని అడిగాడు. నల్లని మేఘాలు ఆకశాన్ని కమేస్తున్న ఆ సమయంలో చీకటి నుంచి వెలుగులోకి ఒక మనిషి వచ్చాడు అతనే మన హీరో. ఫైజాల్ ప్రశ్నకి సమాధానంగా ‘A Fire Strom… and its coming” అన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ‘OG’గా ఇంట్రడ్యూస్ అయ్యాడు.
క్లైమాక్స్ 16 ఫిక్స్ (Pawan Kalyan OG Movie)..
అదే విధంగా ఈ వీడియోలో క్లైమాక్స్ గురించి సుజీత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నోటితో నేరుగా ఏదీ చెప్పలేదు. కానీ, వీడియో మీద ఓ లుక్ వేస్తే.. క్లైమాక్స్ కోసం చాలా డ్రాఫ్ట్స్ రాసినట్టు ఈజీగా అర్థమైంది. ‘క్లైమాక్స్ 15’ అని రాసి, చివరకు దాన్ని చెత్తబుట్టలో పడేశారు. అంటే.. 15 సార్లు క్లైమాక్స్ చేంజ్ చేశారన్నమాట. చివరకు, 16వ క్లైమాక్స్ ఓకే చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ఇవ్వనుండగా.. ఈ మధ్య సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, ఆయన కలిసి కొన్ని లొకేషన్స్ చూసి వచ్చారు. అదే విధంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో OG టైటిల్ రిజిస్టర్ చేయించారు నిర్మాత డీవీవీ దానయ్య. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.