Site icon Prime9

కైకాల సత్యనారాయణ : తన కొడుక్కి రామారావు అని సత్యనారాయణ అందుకే పేరు పెట్టారా ?

inteeresting facts behind kaikala sathyanarayana son ramarao name

inteeresting facts behind kaikala sathyanarayana son ramarao name

Kaikala Sathyanarayana : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. దిగ్గజ నటుడు కైకాల స‌త్యనారాయణ ఈ లోకాన్ని వీడడం పట్ల టాలీవుడ్ నటీనటులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 777 సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వందలాది సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు కైకాల సత్యనారాయణ. వయోభారంతో గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కైకాల సత్యనారాయణ భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

కాగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద వంటి పాత్రలేన్నింటినో పోషించి… సత్యనారాయణ గొప్ప నటుడిగా ఖ్యాతి ఘడించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయన… క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎస్వీ రంగారావు గారి తరువాత అంతటి పేరుని సంపాదించుకున్న ఏకైక నటుడు అని చెప్పాలి. ‘సిపాయి కూతురు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కైకాల… 777 సినిమాలలో నటించారు. 60ఏళ్ళు సినీ ప్రస్థానంలో నాలుగు తరాల నటీనటులతో నటించారు కైకాల. కాగా ముఖ్యంగా ఎన్టీఆర్, సత్యనారాయణ కలిసి నటించిన సినిమాలు అక్షరాలా వంద. క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటుడు కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిద్దరిదే అని చెప్పాలి.

సత్యనారాయణ ఎన్టీఆర్ కి డూప్‌‌గా ఎన్నో సినిమాలు చేశాడు. కైకాల శరీర ఆహార్యం ఎన్టీఆర్ కి దగ్గరగా ఉండడంతో పలు సినిమాల్లో ఎన్టీఆర్ కి డూప్ గా చేశారు. అయితే తన కోసం ఇంత కష్టపడుతున్న కైకాలని చూసి ఎన్టీఆర్… ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమాలో నటుడిగా అవకాశాన్ని ఇచ్చాడు ఎన్టీఆర్. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ కథానాయకుడి పాత్రలో ఉంటే కైకాల సత్యనారాయణ ప్రతినాయకుడి పాత్రల్లో ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో కలిసి దాదాపు 100 పైగా సినిమాల్లో నటించాడు. అయితే ఎన్టీఆర్ అంటే తనకి భక్తి, భయం రెండు ఉన్నాయని ఆయన వల్లే నేను ఈ స్థాయికి ఎదిగానని పలు సందర్భాల్లో కైకాల వెల్లడించారు. తన సొంత తమ్ముడి లాగా ఎన్టీఆర్ నన్ను చూసుకునే వారని ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడారు.

సత్యనారాయణకి పద్మావతి, రమాదేవి అనే ఇద్దరు కుమార్తెలు, లక్ష్మీనారాయణ, రామారావు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా ఎన్టీఆర్ పైన అభిమానంతోనే సత్యనారాయణ తన రెండో కుమారుడికి రామారావు అని పేరు పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కైకాల సత్యనారాయణ భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. రేపు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.కైకాల సత్యనారాయణ తన కొడుక్కి అందుకే రామారావు అని పేరు పెట్టారా ?

Exit mobile version
Skip to toolbar