Bengaluru: “ఇడ్లీ ఏటీఎం”.. 24 గంటలూ వేడి వేడి ఇడ్లీ రెడీ..!

సాధారణంగా ఏటీఎంలను మనీ విత్ డ్రా చేసేందుకే ఉపయోగిస్తాం కదా అయితే తాజాగా వేడి వేడి ఇడ్లీలు అందించే ఏటీఎంలు కూడా అందుబాటులోకి వచ్చాయండోయ్. ఇదిక్కడా అలా ఎలా వేడివేడి ఇడ్లీలు వస్తున్నాయా అనుకుంటున్నారా.. కర్ణాటక రాజధానిలో ఒక స్టార్టప్‌ కంపెనీ ఈ‘ఇడ్లీ ఏటీఎం’లను అందుబాటులోకి తెచ్చింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Bengaluru: సాధారణంగా ఏటీఎంలను మనీ విత్ డ్రా చేసేందుకే ఉపయోగిస్తాం కదా అయితే తాజాగా వేడి వేడి ఇడ్లీలు అందించే ఏటీఎంలు కూడా అందుబాటులోకి వచ్చాయండోయ్. ఇదిక్కడా అలా ఎలా వేడివేడి ఇడ్లీలు వస్తున్నాయా అనుకుంటున్నారా.. కర్ణాటక రాజధానిలో ఒక స్టార్టప్‌ కంపెనీ ఈ‘ఇడ్లీ ఏటీఎం’లను అందుబాటులోకి తెచ్చింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్‌ల స్టార్టప్ అయిన ఫ్రెషప్ రోబోటిక్స్ ఈ ఇడ్లీ ఏటీఎం యంత్రాన్ని రూపొందించింది. ఇరవై నాలుగు గంటలు వేడి వేడి ఇడ్లీలు అందించే ఈ ఏటీఎంను ఫ్రెషాట్‌లో ఏర్పాటు చేశారు. ఇది కేవలం 12 నిమిషాల్లో 72 ఇడ్లీలు తయారు చేస్తుందని శరణ్ హిరేమత్ తెలిపారు. చట్నీ, కారప్పొడి వంటి వాటితో ఇడ్లీలను ప్యాక్‌ చేసి కస్టమర్లకు ఈ మిషన్ అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏటీఎం ద్వారా ఇడ్లీలు పొందడం చాలా సులువు. ఏటీఎం వద్ద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ ఫోన్‌తో స్కాన్ చేసి మెనూలో మీకు నచ్చిన ఆర్డర్ ఇచ్చి డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే చాలు. నిమిషంలోపే చట్నీతో కూడిన ఇడ్లీ ప్యాక్‌ ఆ ఏటీఎం నుంచి బయటకు వస్తుంది. 2016లో తన కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు అర్థరాత్రి వేళ ఎక్కడా వేడివేడి ఇడ్లీలు లభించక ఇబ్బంది పడినట్లు శరణ్ హిరేమత్ చెప్పారు. ఆ బాధ నుంచే 24 గంటలపాటూ తాజాగా ఇడ్లీలు తయారు చేసే ఏటీఎం యంత్రాన్ని రూపొందించాలనే ఆలోచన వచ్చిందని ఆయన వివరించారు.

ఇదిలా ఉండగా అల్పాహారం కోసం దక్షిణ భారత్‌లో ఏర్పాటు చేసిన తొలి ఆటోమేటెడ్ కుకింగ్‌, పంపిణీ యంత్రం ఇదేనని హిరేమత్‌ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులోని రెండు చోట్ల ఇడ్లీ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. వీటిని మరింతగా విస్తరించడంతోపాటు దోస, రైస్‌, జ్యూస్‌ వంటి ఏటీఎంలను కూడా అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, వేడి వేడిగా ఇడ్లీలు అందించే ఈ ఏటీఎం వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఇదీ చదవండి:ప్రియురాలితో షాపింగ్‌.. భార్యకు చిక్కిన భర్త.. ఆపై ఏం జరిగిందంటే..?