Janasena Formation Day : ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్న నిరంతర కృషీవలుడు పవన్ కళ్యాణ్. వాటన్నింటినీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పక్షాన ఉంటూ వారి కోసం నిలబడ్డారు ఈ జనసేనాని. కాగా జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. తాగునీటి సదుపాయం, వైద్య సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాలంటీర్లు పని చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్నందున జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంది. అదే విధంగా పోలీసుల సూచనల మేరకు జనసేన సైనికులు, కార్యకర్తలు జాగ్రత్తగా రావాలని పార్టీ నేతలు కోరుతున్నారు.
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ (Janasena Formation Day)..
బందరు నగర శివారులో జరగనున్న ఈ వేడుక కోసం జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ ఆటోనగర్ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి నుంచి ర్యాలీగా సభా వేదికకు చేరుకుంటారు. మొదటిసారి పవన్ వారాహిపై రానుండడం గమనార్హం. సభా స్థలంలో 1,20,000 మంది పైగా కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ మేరకు ఉదయం నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ భారీ ఎత్తున సభా స్థలి వద్దకు చేరుకుంటున్నారు.
ఈ కార్యక్రమం జరిగే సభా వేదిక వద్దకు మొదటి సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనంలో చేరుకోనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సభ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆవిర్భావ సభ కోసం కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఈ దిగ్విజయ సభ కోసం 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కనీవినీ ఎరుగని రీతిలో సభ స్థలి ముస్తాబు అయ్యింది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని వసతులతో సభా ప్రాంగణం సిద్ధం అయ్యింది. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా స్థలం కేటాయించినట్లు తెలిపారు.
(Janasena Formation Day) ప్రత్యేక గీతం విడుదల..
గబ్బర్ సింగ్ టీం ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన గీతాన్ని మనోహర్ సోమవారం సభ వేదిక వద్ద విడుదల చేశారు. భగభగ మండే భగత్ సింగ్ అంటూ వచ్చే గీతం అందరిలో స్ఫూర్తి నింపేలా ఉంటుందని మనోహర్ గబ్బర్ సింగ్ టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు 2024 ఎన్నికలకు పవన్ సిద్ధపడుతున్న వేళ.. భారీ ర్యాలీతో బందర్ రావటానినికి సిద్ధం అవుతున్న జనసేన కర్యకర్తలు, నేతలు. అయితే ర్యాలీపై పోలీసుల ఆంక్షలతో ఉత్కంఠ నెలకొంది. ఎటువంటి ర్యాలీకి అనుమతి లేదంటూ కృష్ణ జిల్లా ఎస్పీ జాషువ ప్రకటించారు. విజయవాడ మచిలీపట్టణం జాతీయ రహదారిపై సభలు, ప్రదర్శనలలకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలు ఉందని.. ఈ నియమాలను ఉల్లంగించిన వారిపై తీవ్ర చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/