Site icon Prime9

Telangana Rains: నేడు తెలంగాణలో భారీ వర్షాలు

Hyderabad: శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుసింది. లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లిలో వర్షం కురిసింది.

కాగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నది. ఈ నెల 25 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది.

Exit mobile version