Site icon Prime9

Pawan Kalyan: ఇప్పటం కూల్చివేతలో బాధితులకు లక్ష చొప్పున ఆర్ధిక సాయం.. పవన్ కల్యాణ్

Financial assistance of one lakh rupees to the victims of the demolition in Ippatam...Pawan Kalyan

Ippatam Village: జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సహకరించారన్న కారణంగా ఇప్పటం గ్రామంపై వైకాపా ప్రభుత్వం కక్షకట్టిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే గ్రామంలో రోడ్డు వెడల్పు సాకుతో సుమారుగా 53 ఇండ్లను పూర్తిగా, పాక్షికంగా నేలమట్టం చేశారు. గ్రామాన్ని సందర్శించే క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సైతం పోలీసులు అడ్డుకొన్నారు. కాగా, కొంతదూరం నడుచుకుంటూ అనంతరం వాహనాల్లో ఇప్పటం గ్రామానికి చేరుకొని ప్రభుత్వ దాష్టికానికి గురైన స్థానికులను పరామర్శించారు.

ఇళ్లు దెబ్బతిన్నా, ధైర్యం కోల్పోకుండా గుండె నిబ్బరాన్ని ప్రదర్శించిన బాధితులను చూపి పవన్ చలించారు. భాదితులకు అండగా ఉంటానన్న భరోసాను నిజం చేస్తూ ఇండ్లు దెబ్బతిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన గ్రామస్ధులకు లక్ష చొప్పున పవన్ కల్యాణ్ సాయం ప్రకటించారు. పేర్కొన్న మొత్తాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా బాధితులకు అందచేయనున్నారు. ఇప్పటం గ్రామం పై వైకాపా ప్రభుత్వ తీరును అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి.

ఇది కూడా చదవండి: Chandrababu Naidu: వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది.. చంద్రబాబు నాయుడు

Exit mobile version