Site icon Prime9

Nidhi Agarwal : బ్యూటీఫుల్ భామ “నిధి అగర్వాల్” కి బర్త్ డే విషెస్..

fans celebrating actress Nidhi agarwal birthday and trending on media

fans celebrating actress Nidhi agarwal birthday and trending on media

Nidhi Agarwal : “సవ్యసాచి” సినిమాలో నటించి టాలీవుడ్ కి  పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. అక్కినేని నాగ చైతన్య సరసన మొదటి సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి. ముఖ్యంగా తమిళ్‌లో ఈమెకు అదిరిపోయే క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ భామ 29 వ ఏట అడుగుపెడుతుంది. దీంతో ఆమె అభిమానులు అంతా సోషల్ మీడియాలో నిధికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి నిధులు పేరుతో సోషల్ మీడియాలో మోత మోగుతుంది.

ఇక ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ సరసన.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు” సినిమాలో నటిస్తుంది. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా మొఘలుల కాలంనాటి కథాంశంతో తెరకెక్కుతుంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ విడుదల కానుంది. మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ వేరే సినిమాలు, రాజకీయాల కారణంగా ఈ సినిమా రిలీజ్ లో జాప్యం జరుగుతుంది

Exit mobile version