Site icon Prime9

ENG vs IND 2nd ODI: లార్డ్స్ లో నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే

ENG vs IND 2nd ODI:లార్డ్స్ వేదికగా నేటి సాయంత్రం 5 గంటలకు భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని బావిస్తోంది.

తొలి వన్డేలో బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణించిన భారత్‌, ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. అదే జోరుతో ఇవాళ జరిగే రెండో వన్డేలోనూ విజయదుందుభి మోగించి, మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలవాలపి ఇంగ్లాండ్‌ చూస్తోంది. గజ్జల్లో గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన విరాట్‌ కోహ్లి, ఈ మ్యాచ్‌లోనూ ఆడేది అనుమానంగానే ఉంది. అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. గత మ్యాచ్‌లో ఆరు వికెట్లతో, అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తే చాలు చెలరేగిపోతున్నాడు. ఇక ఏడాదిన్నర విరామం తర్వాత తొలి వన్డే ఆడిన షమి తన పునరాగమనాన్ని ఘనంగా ప్రారంభించాడు. తన బౌలింగ్‌ వైవిధ్యంతో మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు చక్కటి సహకారం అందిస్తూ ప్రత్యర్థుల పని పడుతున్నాడు.

ఇక ఇంగ్లాండ్ జట్టు ప్రతీకారేచ్ఛతో రగిలి పోతుంది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ను అయిన దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. కీలకమైన రెండో వన్డేలో ఎదురు దాడికి దిగేందుకు వ్యూహాలు పన్నుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ చేజారే ప్రమాదం ఉంది కాబట్టి బట్లర్‌ సేన తెగించి ఆడే అవకాశం ఉంది.

Exit mobile version